»   » నా చెల్లెలు కూడా హాస్టల్లోనే ఉంది...వరుణ్ సందేశ్

నా చెల్లెలు కూడా హాస్టల్లోనే ఉంది...వరుణ్ సందేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"అమీర్‌పేట్ హాస్టళ్ళను చెడుగా చూపించామనీ మరొకటనీ కొన్ని రివ్యూలు నెగెటివ్‌గా వచ్చాయి. కానీ ఈ సినిమాలో అందరినీ తప్పు పట్టలేదు. నా చెల్లెలు కూడా హాస్టల్లోనే ఉంటోంది. మా దర్శకుడి చెల్లెలు అమీర్‌పేట్ హాస్టల్లోనే ఉంటోంది. కాకపోతే అక్కడ కనిపించే కొన్ని వాస్తవాలను దర్శకుడు తెరకెక్కించాం అంటూ స్పందించారు వరుణ్ సందేశ్. క్రిందటి వారం విడుదలైన వరుణ్ తాజా చిత్రం 'ఏమైంది ఈ వేళ' చిత్రంలో అమీర్ పేట హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల ప్రవర్తన బాగోలేదని, సెక్స్ కోసమే తపిస్తున్నట్లు చూపెట్టారని విమర్శలు వస్తున్న నేపధ్యంలో మీడియాను కలసిన వరుణ్ ఇలా సమాధానమిచ్చారు. "నేనెప్పుడూ బ్యాచ్‌లర్ రూముల్లో లేను. ఈ సినిమా వల్ల ఆ అనుభూతి కలిగింది అన్నారు. ఈ చిత్రం ద్వారా సంపత్‌నంది దర్సకుడుగానూ, నిషా అగర్వాల్(కాజల్ చెల్లెలు) హీరోయిన్ గానూ పరిచయం అయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu