»   » నా భార్యే ఎక్కువ సంపాదిస్తోంది: హీరో పంచ్ అదుర్స్

నా భార్యే ఎక్కువ సంపాదిస్తోంది: హీరో పంచ్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హీరో రాహుల్ రవీంద్రన్ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ 'స్నాప్‌డీల్'ను ఉద్దేశించిన చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. రాహుల్ రవీంద్రన్ వ్యాఖ్యలకు ఆయన భార్య, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా మద్దతు పలకడంతో 'స్నాప్‌డీల్'కు గట్టి పంచ్ పడింది.

స్నాప్‌‌డీల్‌ ఇటీవల నిర్వహించిన భారీ సేల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. మహిళల షాపింగ్‌ నుద్దేశించి 'జజ్బా' సినిమాలో ఐశ్వర్యరాయ్‌ పరుగెడుతున్న వీడియోను పోస్ట్‌ చేసింది.

ఆ కామెంట్ వల్లే...

ఆ కామెంట్ వల్లే...

‘ఎంత షాపింగ్‌ చేశారో మీ భర్త తెలుసుకునే లోపే...డోర్‌ దగ్గరకు పరిగెత్తడం'.... మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే రీ ట్వీట్ చేయండి అంటూ స్నాప్ డీల్ పెట్టిన కామెంట్ చూసి రాహుల్ రవీంద్రన్ ఘాటుగా స్పందించారు.

Leaked Video : Singer Suchitra Molested By Dhanush
నా భార్యే ఎక్కువ సంపాదిస్తోంది

నా భార్యే ఎక్కువ సంపాదిస్తోంది

రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ ‘గతేడాది నా సంపాదన కన్నా నా భార్య సంపాదన ఎక్కువ. నాకంటే ఎక్కువ పన్ను చెల్లిస్తోంది. ఆమె తన ఆన్‌ లైన్‌, ఇతర షాపింగ్‌ కోసం ఆమె సంపాదించిన డబ్బులే వాడుతుంది. ఆమె ఎక్కడికీ పరిగెత్తాల్సిన అవసరం లేదు' అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.

ఇలాంటి భర్తే కావాలి

ఇలాంటి భర్తే కావాలి

రాహుల్ ట్వీట్‌ నేపథ్యంలో చిన్మయి స్పందిస్తూ....'ఇలాంటి భర్తను ప్రతి అమ్మాయి కోరుకుంటుంది' అంటూ మరో ట్వీట్ చేసింది.

పంచ్ అదుర్స్

పంచ్ అదుర్స్

రాహుల్ రవీంద్రన్, చిన్మయి కలిసి స్నాప్ డీల్ మీద వేసిన పంచ్ అదుర్స్ అంటూ నెటిజెన్లు ఈ లవ్లీ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

English summary
"My wife filed higher returns than I did last year and pays for her own online or otherwise shopping. She ain't gotta run anywhere. " Rahul Ravindran counter to Snapdeal ad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu