»   » ముద్దులు, కౌగిలింతలు! కుర్ర హీరో భార్య గ్రీన్ సిగ్నల్

ముద్దులు, కౌగిలింతలు! కుర్ర హీరో భార్య గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వారసత్వం పునికి పుచ్చుకున్న ఆయన అల్లుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్నాడు. 2013లో తన ప్రియురాలు సైంధవిని పెళ్లాడిన జీవీ ప్రకాష్ పెళ్లి తర్వాత నటుడిగా కూడా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు ప్రస్తానం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు తెర వెనక ఉండి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ త్వరలో 'పెన్సిల్' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రానికి గౌతం మీనన్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన మణి నాగరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ ఇంటర్మీడియట్ కుర్రాడిగా నటిస్తున్నాడు. అతని ప్రియురాలిగా శ్రీదివ్య నటించింది. అయితే తాను హీరోగా మారిన తర్వాత సంగీత ప్రపంచానికి దూరం అవుతానని మాత్రం ఊహించుకోవద్దు. సంగీతమే నా సర్వస్వం. నటనా రంగంలో ఎంతకాలం ఉంటానో తెలియదు కానీ.... లైఫ్ లాంగ్ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే ఉంటాను అని జీవి ప్రకాష్ స్పష్టం చేసారు.

My Wife Not Restricted Me: GV Prakash

అయితే హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న తన భర్తకు చాలా కండీషన్లు పెట్టింది జీవీ ప్రకాష్ భార్య సైంధవి అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జీవి ప్రకాస్ స్పందిస్తూ అలాంటి వేమీ లేదని స్పష్టం చేసాడు. సైంధవి పాటలు, రికార్డింగ్‌లు అంటూ తన పని తాను చూసుకుంటోంది. నేను నా పని చేసుకుంటున్నాను. హీరోయిన్లను కౌగిలించుకోకూడదు, ముద్దులు పెట్టుకోకూడదన్న షరతులేవీ విధించలేదు. సినిమా నటుల అయ్యాక కథకు అనుగుణంగా నటించాలి. ఆ విషయం సైంధవికి కూడా తెలుసు. ఆమె నా ఎదుగుదల కోరుకనే వ్యక్తి. నాకు ఎలాంటి షరతులు విధించలేదు. అన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. అని చెప్పుకొచ్చాడు జీవి ప్రకాష్.

English summary
"My wife haven't laid any conditions regarding kissing a heroine's lips or hugging her on silver screen. That's all for the sake of story and cinema, it's not real. So, Saindavi knows perfectly about them. She didn't laid any rules, all that you heard is just a rumour", said GV Prakash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu