twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బురద జల్లేందుకే ఈ చీప్ ట్రిక్స్.. ‘ఆచార్య’ వివాదంపై స్పందించిన మైత్రీ మూవీస్

    |

    ఆచార్య సినిమాపై నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథ తనదేనంటూ ఓ యువ రచయిత రాజేష్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. మైత్రీ మూవీస్ వారికి తన కథను వినిపించానని, అయితే ఆ కథనే కొరటాల శివ తీస్తున్నాడని రాజేష్ అనే వ్యక్తి మీడియాకెక్కాడు. ఇక కొరటాల శివ సైతం రాజేష్‌తో మీడియాలో లైవ్‌లో పాల్గొని వాటిని ఖండించాడు. రాజేష్ చెప్పిన కథ, ఆచార్యది కాదని ఇది వేరేదని స్పష్టం చేశాడు. అసలు ఈ వివాదం మైత్రీ మూవీస్ కేంద్రంగా జరుగుతుండటంతో వారు కూడా స్పందించారు.

    మేమే తీసేవాళ్లం కదా..

    మేమే తీసేవాళ్లం కదా..

    రాజేష్ మందూరి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. మేము ఆయన స్టోరీ (టైటిల్ అన్నయ్య అనుకున్నాడు)ని కొరటాలకు చెప్పామని అంటోన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ ఆరోపణలన్నీ నిరాధారితమైనవి.. అవాస్తవాలు. ఆయన చెప్పినట్టు స్టోరీ కథ బాగుండి ఉంటే.. సరైన క్యాస్టింగ్ సమకూర్చి మేమే సినిమా తీసేవాళ్లం కదా అని మైత్రీ మూవీస్ పేర్కొంది.

    ముగ్గురు కొత్త దర్శకులను..

    ముగ్గురు కొత్త దర్శకులను..

    మేం ఇప్పటికే భరత్ కమ్మ, రితేష్ రానా, బుచ్చిబాబు సనా వంటి దర్శకులను పరిచయం చేసిన వాళ్లం ఇతన్ని చేయలేమా? ఒక వేళ కథ మాకు నచ్చి, బాగుండి ఉంటే మేము ఇతడ్ని పరిచయం చేయలేకపోవడానికి మాకు ఎలాంటి కారణాలుంటాయ్ అని మైత్రీ ప్రశ్నించింది.

    బురదజల్లేందుకు

    బురదజల్లేందుకు

    అసలు నిజమేంటంటే.. ఆయన మాకు చెప్పిన కథ చాలా వీక్‌గా ఉంది.. కంటెంట్‌లో అంత సత్తా లేదు.. అందుకే మేము రిజెక్ట్ చేశాం. అదే మేం ఆయనకు చెప్పాం. అసలు కథే బాగా లేకపోతే.. ఇక కొరటాల శివ గారికి మేం ఎందుకు చెబుతాం. ఓ గొప్ప దర్శకుడిగా కొరటాల శివ గారు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. విలువలతో కూడిన చిత్రాలను తెరకెక్కించే కొరటాల శివ గారి ఇమేజ్‌పై బురదజల్లేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా మీడియాకెక్కి పరువుదీస్తున్నాడు అని మైత్రీ చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Sarkaru Vaari Paata : Reason Behind Mahesh Babu Tattoo
     చీప్ గిమ్మిక్స్

    చీప్ గిమ్మిక్స్

    మీడియాలో ఆయన చేస్తోన్న ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అతనిపై చర్యలు తీసుకోబోతోన్నాం. ఆయన చేసే ఆరోపణలు పట్టించుకోవద్దని మీడియాను మేము కోరుతున్నాం. పబ్లిసిటీ దక్కించుకోవడం కోసం ఇలాంటి చీప్ గిమ్మిక్స్ ప్లే చేస్తున్నాడని క్లియర్‌గా అర్థమవుతోంది అంటూ మైత్రీ మూవీస్ పేర్కొంది.

    English summary
    Koratala siva about rajesh and Acharya Copy Issues. Megastar Chiranjeevi's Acharya Story landed in copy right Issue. Many contradictory stories in Media goes viral. In this occassion, Matinee Entertainment clarity on rumours Which producing Acharya movie. They have released press note and stated that Acharya story is orginal. Its hard work of Koratala Siva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X