For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహేశ్, ఎన్టీఆర్, బన్నీలతో సినిమా.. అధికారిక ప్రకటన చేసిన మైత్రీ నిర్మాత

|
Dear Comrade Movie Producers Press Meet || Filmibeat Telugu

తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా పేరొందింది మైత్రీ మూవీ మేకర్స్. న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సీవీఎం) కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాలు చేస్తూ మంచి ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి భారీ హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ముగ్గురు నిర్మాతలు.

ప్రెస్‌‌మీట్ పెట్టి క్లారిటీ

ప్రెస్‌‌మీట్ పెట్టి క్లారిటీ

మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా నిర్మించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా వివరాలతో పాటు తమ సినిమాల విషయంలో వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చేశారు.

‘గ్యాంగ్ లీడర్' వాయిదా

‘గ్యాంగ్ లీడర్' వాయిదా

నేచురల్ స్టార్ నాని - క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. నిర్మాణాంతర కార్యక్రమాలను చేసుకుంటోంది. ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన నవీన్ క్లారిటీ ఇచ్చారు. ‘నాని ‘గ్యాంగ్ లీడర్' షూటింగ్ పూర్తియింది. దీన్ని ఆగస్టు 30న విడుదల చేద్దాం అనుకున్నాం. అయితే, ‘సాహో' అదే రోజు వస్తుండడంతో వాయిదా వేశాం. త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తాం' అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత ప్రాజెక్టులు

ప్రస్తుత ప్రాజెక్టులు

ప్రస్తుతం మైత్రీ సంస్థ నిర్మిస్తున్న సినిమాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్న ‘ఉప్పెన', విజయ్ దేవరకొండ ‘హీరో' సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని నవీన్ వెల్లడించారు. ‘ఉప్పెన' నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు.

బన్నీతో సినిమా

బన్నీతో సినిమా

త్వరలోనే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తామని మైత్రీ అధినేత వెల్లడించారు. ‘బన్నీ - సుకుమార్ గారి సినిమా అక్టోబర్, నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ లోపు ఆయన త్రివిక్రమ్ గారి సినిమాను పూర్తి చేసేస్తారు. ఆ తర్వాతే ఇది మొదలు పెడతాం' అని ఆయన వెల్లడించారు.

మహేశ్‌ కథలు వింటున్నారు

మహేశ్‌ కథలు వింటున్నారు

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తమ సంస్థలో సినిమా చేయబోతున్నారని నవీన్ ప్రకటించారు. ‘మహేశ్ బాబు గారు కూడా మా సంస్థలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నారు. ఈ మధ్యనే పరశురాం చెప్పిన కథను విన్నారు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఈ సినిమా సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది' అని తెలిపారు.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్

ఈ సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సినిమా చేస్తారని చెప్పారు. ‘ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీఎఫ్- 2' చేస్తున్నారు. అది పూర్తవ్వాలి. అలాగే, ఎన్టీఆర్ గారి ‘RRR' కూడా అయిపోవాలి. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే 2020 చివర్లో కానీ, 2021 ప్రారంభంలో కానీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి' అని నవీన్ పేర్కొన్నారు.

English summary
Tollywood Young Heros Jr Ntr, Mahesh Babu, Allu Arjun Will Work With Big Production House Mythri Movie Makers. This News Hot Topic In Tollywood. Big Producer Y. Naveen Clarity About This.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more