For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ.. కేజీఎఫ్ డైరెక్టర్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఎంతంటే!

  |

  కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటూనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో బహు భాషా చిత్రం కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలను అందించిన మైత్రీ మూవీస్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నది. పక్కా మాస్ థ్రిలర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ అందుకొంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇంతకు ఈ క్రేజీ డైరెక్టర్ ఎంత పారితోషికం తీసుకొంటున్నారంటే..

  Rajamouli: నా ప్రయాణంలో భాగస్వామివి.. దర్శకధీరుడి ఎమోషనల్ కామెంట్

  ఎన్టీఆర్‌తో కేజీఎఫ్ డైరెక్టర్

  ఎన్టీఆర్‌తో కేజీఎఫ్ డైరెక్టర్

  గత కొద్దికాలంగా కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు దక్షిణాది మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే అటు ప్రశాంత్ నీల్ గానీ, ఎన్టీఆర్ గానీ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయితే ప్రాజెక్టు ఉంటుందనే విధంగా సంకేతాలు మాత్రం బయటకు వచ్చాయి.

  యంగ్ టైగర్‌తో సినిమా అని కన్ఫర్మ్

  యంగ్ టైగర్‌తో సినిమా అని కన్ఫర్మ్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్ తమ ప్రాజెక్టుకు అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. నా తదుపరి సినిమా న్యూక్లియర్ ప్లాంట్ లాంటి హీరోతో. నా రేడియేషన్ సూట్ క్రేజీ ఎనర్జీ తారక్‌తో ఉండబోతున్నది. హ్యాపీ బర్త్ డే బ్రదర్. సేఫ్ అండ్ గ్రేట్ బర్త్ డేను జరుపుకో. త్వరలోనే మిమల్ని కలుస్తాను అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.

  కేజీఎఫ్ 2 బిజీలో ప్రశాంత్ నీల్

  కేజీఎఫ్ 2 బిజీలో ప్రశాంత్ నీల్

  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకా షూటింగ్ పార్ట్ కొంత మిగిలి పొయింది, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో షూట్‌ నిలిచిపోవడంతో మ్యూజిక్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టిపెట్టారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌తో కలిసి పనిచేస్తున్న ఫోటోను షేర్ చేశారు.

  RRR మూవీతో ఎన్టీఆర్

  RRR మూవీతో ఎన్టీఆర్

  ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. RRR 'సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూట్ వాయిదా పడటంతో డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తదుపరి చిత్రాన్ని చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా ప్రారంభమవుతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.

  ప్రశాంత్ నీల్‌కు భారీ పారితోషికం

  ప్రశాంత్ నీల్‌కు భారీ పారితోషికం

  ఇక ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రశాంత్ నీల్‌కు భారీ పారితోషికాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా కోసం అడ్వాన్సుగా ఇప్పటికే రూ.2 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఫుల్ రెమ్యునరేషన్ సుమారు 5 కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ కన్నడ దర్శకుడు ఈ రేంజ్‌లో పారితోషికం అందుకోవడం మొదటిసారి అని కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

  దసరా బరిలో కేజీఎఫ్ 2

  దసరా బరిలో కేజీఎఫ్ 2

  కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాను దసరా కానుకగా అంటే అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన యష్ మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి విలక్షణ నటులు నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

  English summary
  Junior NTR to work with KGF Fame director Prashanth Neel after RRR and Trivikram Srinivas movies. Prashanth neel confirms the news on NTR birthday. Reports suggest that Mythri Movie Makers offers Prashanth Neel remuneration for NTR movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X