»   »  దిమ్మ తిరిగే ఆఫర్ : పవన్ కోసం 60 రోజులకు 40 కోట్లు ?

దిమ్మ తిరిగే ఆఫర్ : పవన్ కోసం 60 రోజులకు 40 కోట్లు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'...మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కొద్దిగా నిరాశపరిచిన 'కాటమరాయుడు' అనంతరం 'పవన్' చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.నిజానికి ఏఎం రత్నం నిర్మాణంలో.. తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తాడని ముందు నుంచి భావించినా.. పవన్ మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ చేయనున్న సినిమాకే మొగ్గాడట. ఇందుకు కమర్షియల్ కమిట్మెంట్స్ కారణంగా చెబుతున్నారు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

'వేదాలం' మూవీ డైరెక్టర్

'వేదాలం' మూవీ డైరెక్టర్

కోలీవుడ్‌లో విజయ్ నటించిన హిట్ మూవీకి ఇది రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే...మొన్నీమధ్యే పవన్ కళ్యాణ్... 'వేదాలం' మూవీ డైరెక్టర్ నీసన్, రత్నంతో కలిసి కొత్త సినిమా విషయమై చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఏ క్లారిటీ లేదు గానీ మైత్రీ మూవీ మేకర్స్ తో జరిగిన ఒప్పందం మాత్రం సంచలంగా మారింది.

60 రోజుల కాల్షీట్స్ కు గాను

60 రోజుల కాల్షీట్స్ కు గాను

శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ కోసం పవన్ కేవలం 60 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇవ్వనున్నాడట. అయితే ఈ 60 రోజుల కాల్షీట్స్ కు గాను.. పవన్ కు 40 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు మైత్రీ మూవీస్ బ్యానర్ సిద్ధపడ్డంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలిందని తెలుస్తోంది.

జనసేన పార్టీని తన సొంత డబ్బులతోనే

జనసేన పార్టీని తన సొంత డబ్బులతోనే

2019 ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. వీలైనంత త్వరగా కాసిన్ని సినిమాలు చేసేసి ఫండ్స్ కూడబెట్టాలన్నది పవన్ యోచన. పార్టీ ఫండ్స్ సేకరిస్తే.. వారి ఒత్తిడి ఫేస్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో.. ఇప్పటివరకూ జనసేన పార్టీని తన సొంత డబ్బులతోనే పవన్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల నాటికి

2019 ఎన్నికల నాటికి

మరోవైపు త్రివిక్రమ్ సినిమా తరువాత పవన్ తాను కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయఃపడుతున్నారు. ఏదేమైనా... జెట్ స్పీడుతో తన కొత్త సినిమా షూటింగ్స్‌ను పూర్తి చేస్తున్న పవన్... 2019 ఎన్నికల నాటికి రెండు సినిమాల్లో కనిపిస్తాడా లేక మూడు సినిమాలతో మురిపిస్తాడా అన్నది చూడాలి.

English summary
As per the buzz. Mythri Movies said to have offered whopping 40 crore remuneration to Pawan.. and Pawan will allot only 40 days of call sheets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu