కన్నడ టీవీ హీరోయిన్ కు రెండేళ్ళ జైలు శిక్ష
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో కన్నడ నటి మైత్రేయి గౌడ కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తు బెంగుళూరు సిటీ కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. అసలు కథకి వస్తే.. 2011 లో మైత్రేయి తన ఫ్రేండ్స్ తో కలిసి కారులో చాలా స్పీడ్ గా వెళ్తూందట..
అంతే కాదు కారు డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడుతుండటంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ కారుని అడ్డుకున్నాడు. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కారుని ఆపి ఆమెను హెచ్చరించడంతో తన స్నేహితురాళ్ల ముందు అవమానంగా ఫీల్ అయిన మైత్రేయి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గొడవకు దిగి కొట్టింది. దాంతో బసవేశ్వర ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది మైత్రేయి గౌడ పై .

దాంతో బసవేశ్వర ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది మైత్రేయి గౌడ పై . కాగా ఈ కేసు విచారణకు రాగా మైత్రేయి గౌడ తో పాటు ఆమె ఫ్రెండ్స్ రూప , సుప్రియ , రేఖ లను దోషులుగా గుర్తిస్తూ మైత్రేయి గౌడ కు రెండేళ్ళ జైలు శిక్ష ,ఆమె ఫ్రెండ్స్ కు ఒక సంవత్సరం శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు . అయితే శిక్ష ఖరారు అయిన వెంటనే నలుగురికీ బెయిల్ మంజూరు చేసింది నగర 5వ ఏసీ ఎం ఎం కోర్టు .


Click it and Unblock the Notifications











