కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా నిర్మితమవుతున్న సినిమాకు ఎన్.శంకర్ దర్శకుడుగా ఎంపిక అయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది. చిరంజీవి తో సినిమా చేస్తారు అనుకున్న ఆయన ఇప్పడు బాలయ్య సినిమాకు ఎంపికవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ సినిమాకు బి.వి.యస్ రవి కథ-మాటలు అందిస్తున్నాడు. కళ్యాణరామ్ చాలా ప్రతిష్ఠాత్మకంగా దీనిని భావించి భారీగా ఈ సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎన్.శంకర్ నితిన్ తో చేసిన రామ్ తర్వాత మెగా ఫోన్ చిర కాల విరామం తర్వాత పట్టనున్నారు. బాలయ్యకీ,ఎన్.శంకర్ కీ ఇద్దరికీ ఈ సినిమా బ్రేక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు బాలయ్య,దాసరి సినిమా కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.