»   » నటుడిగా మారుతున్న తెలంగాణ శంకర్

నటుడిగా మారుతున్న తెలంగాణ శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జైబోలో తెలంగాణ చిత్రం తర్వాత తెలంగాణ శంకర్‌గా పాపులర్ అయిన దర్శకుడు ఎన్.శంకర్ త్వరలో నటుడిగా మారబోతున్నాడు. 'రిపోర్టర్' మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ కత్తి దర్శకత్వంలో రామ్‌కీ హీరోగా ఈచిత్రం తెరకెక్కుతోంది.

నటన వైపు మరలడంపై ఎన్.శంకర్ స్పందిస్తూ..'నన్ను నటించమని కొందరు దర్శకులు అడిగినప్పుడు.... నా ఎత్తు, పొట్ట చూసిన తర్వాత నన్ను తెరపై చూపించాలనుకుంటున్నారా? అని నవ్వుకున్నాను. కానీ కథ, కథనం నచ్చడం...విలువలు గల సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకున్నాను' అన్నారు.

దర్శకుడు మహేష్ కత్తి మాట్లాడుతూ..'జర్నలిస్టుల మీద సెటైర్లు వేస్తూ పలు చిత్రాలు వచ్చాయి. కానీ జర్నలిస్టులు ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పే చిత్రం ఇది. ఓ గ్రామీణ రిపోర్టర్ కథ అని తెలిపారు. హీరో రామ్ కీ మాట్లాడుతూ రిపోర్టర్స్ గురించి, పాత్రికేయ విలువల గురించి గొప్పగా చూపించే సినిమా ఇది' అన్నారు. చలపతిరావు, సురేష్, తషు కౌషిక్ నటించారు. ఈ చిత్రానికి రఘు కుంచె, డాక్టర్ జోశ్యభట్ల సంగీతం అందించారు.

ఎన్.శంకర్ గురించి విషయాల్లోకి వస్తే...ఎన్ కౌంటర్ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన ఆయన శ్రీరాములయ్య, యమజాతకుడు, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జైబోలో తెలంగాణ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్ కామర్స్‌కు ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.

English summary
‘Telugu film Screen is deprived of honest characters for a while now. Stereotypes are ruling the roost and it becomes everyone’s responsibility to make it count when one such attempt is being made’ Says N. Shankar, the award winning filmmaker.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu