»   » విజయేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా 'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌

విజయేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా 'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాంబశివ హీరోగా సంతోషి శర్మ హీరోయిన్‌గా జి.ఎస్‌.కె. ప్రొడక్షన్‌ పతాకంపై శివ ప్రసాద్‌ గ్రంధే స్వీయ దర్శకత్వంలో రూపొందించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నా కథలో నేను'. నవనీత్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌లోని మొదటి పాటను స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాంబశివ, హీరోయిన్‌ సంతోషి శర్మ, దర్శక నిర్మాత శివప్రసాద్‌ గ్రంధే, సంగీత దర్శకుడు నవనీత్‌ తదితరులు పాల్గొన్నారు. మిగతా నాలుగు పాటలను కూడా త్వరలో రిలీజ్‌ చేసి అతి త్వరలో సినిమాని రిలీజ్‌ చేయనున్నారు.

ఈ సందర్భంగా స్టార్‌ రైటర్‌ వి. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ - ''నా కథలో నేను' చిత్రం మొదటి పాట చాలా బాగుంది. నవనీత్‌ సంగీతం చాలా వినసొంపుగా వుంది. క్రొత్త వాళ్లు అయినా అందరూ బాగా చేశారు. శివప్రసాద్‌ ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాడు. అతని ప్రయత్నం సక్సెస్‌ కావాలి. ఈ చిత్రం సక్సెస్‌ అయి ఈ టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Naa Khathalo Nenu song released by Vijayendra Prasad

దర్శక నిర్మాత శివప్రసాద్‌ గ్రంధే మాట్లాడుతూ - ''చిన్న సినిమా అయినా కూడా అడిగిన వెంటనే మా కోరిక మన్నించి మా చిత్రంలోని మొదటి పాటని రిలీజ్‌ చేసిన విజయేంద్రప్రసాద్‌గారికి మా కృతజ్ఞతలు. యూత్‌ఫుల్‌ లవ్‌ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కిచాం. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాని రిలీజ్‌ చేస్తాం'' అన్నారు.

సంగీత దర్శకుడు నవనీత్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నాలుగు పాటలు వున్నాయి. మొదటి పాటని విజయేంద్ర ప్రసాద్‌గారు రిలీజ్‌ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత శివప్రసాద్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: లక్క ఏకారి, సంగీతం: నవనీత్‌, పాటలు: మోనిక ఏకారి, రచన నిర్మాత, దర్శకత్వం: శివప్రసాద్‌ గ్రంధే.

English summary
Naa Kathalo Nenu movie is youthful, love entertainer. Samba Siva and Santhoshi Sharma are the lead pair. Navaneeth is the music director. This movie's first song released by V Vijayedra Prasad. He said I was impressed the audio of the Naa Kathalo Nenu Audio.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X