»   » ‘నా నువ్వే’ ట్రైలర్: ఆసక్తిరేపుతున్న కళ్యాణ్ రామ్‌-తమన్నా రొమాన్స్

‘నా నువ్వే’ ట్రైలర్: ఆసక్తిరేపుతున్న కళ్యాణ్ రామ్‌-తమన్నా రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘నా నువ్వే’ ట్రైలర్: ఆసక్తిరేపుతున్న కళ్యాణ్ రామ్‌-తమన్నా రొమాన్స్

నందమూరి కళ్యాణ్‌ రామ్‌, తమన్నా జంటగా ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నా నువ్వే'. టైటిల్ ఖరారు చేశారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనలు మరింత పెంచింది. కళ్యాణ్ రామ్‌ను ఇప్పటి వరకు చూడని ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ఇందులో చూడబోతున్నాం. తమన్నా రేడియో జాకీ పాత్రలో కనిపించనుంది.

"కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్, ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు గా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

Naa Nuvve - Telugu Trailer

"ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. అయన కి ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ని ఇస్తుంది అని నమ్ముతున్నామని చిత్ర బృందం వెల్లడించింది. లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు.

ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర

English summary
Naa Nuvve movie Telugu Trailer released. When you have the entire universe including the stars , working towards making your love story a success, could there be any obstacles? Presenting the fascinating trailer of #NaaNuvve by Jayendra starring Nandamuri Kalyan Ram and Tamannaah! With music by Sharreth, here's for a romantic tale like none other!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X