twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిలటరీ మాధవరంలో సినిమా ఫంక్షన్, గర్వంగా ఉంది: ‘నా పేరు సూర్య’ ఆడియో వేడుకలో బన్నీ!

    By Bojja Kumar
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో విడుదల కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా మిలటరీ మాధవరం అనే గ్రామంలో గ్రాండ్‌గా జరిగింది.

    Recommended Video

    Allu Arjun Aggressive Speech At Naa Peru Surya Audio Launch

    బ్రిటీష్ పాలనలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలటరీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. అలాంటి వీర సైనికుల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అందుకే ఈ చిత్ర ఆడియో వేడుక ఇక్కడ నిర్వహించారు.

    ఇక్కడ ఫంక్షన్ చేయడం గర్వంగా ఉంది

    ఇక్కడ ఫంక్షన్ చేయడం గర్వంగా ఉంది

    ఈ సినిమాకు పబ్లిసిటీ ఎలా చేద్దాం అనుకున్నపుడు ఏదైనా మిలటరీకి సంబంధించిన ప్లేసులో పంక్షన్ చేద్దామనుకున్నాం. ఎలా చేద్దాం అని ఆలోచిస్తుండగా మిలటరీ మాధవరం గురించి తెలిసిందే. మా వెస్ట్ గోదావరిలో, మా ఆంధ్రప్రదేశ్‌లో, మా ఊరి దగ్గరే మాధవరం అనే ఊరుంది. అది ఎంత ఫేమస్ అంటే దాన్ని మిలటరీ మాధవరం అని పిలుస్తారని నాకు తెలియలేదు. నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియనందుకు క్షమించండి. తెలుసుకున్న వెంటనే నేను, డైరెక్టర్ గారు ఈ సినిమా ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడే చేయాలని ఫిక్స్ అయ్యాం. ఈ ఫంక్షన్ ఈ రోజు ఇక్కడ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊర్లో ప్రతి గడప నుండి ఒకరు వెళ్లి ఇండియన్ ఆర్మీకి సేవ చేశారు. వరల్డ్ వార్ 2 నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుందన్న విషయం తెలుసుకున్నాను. ఇలాంటి ఊర్లో మా సినిమా ఫంక్షన్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది.

    నాకెంతో ఇష్టమైన వ్యక్తికి నేను సినిమా చేసుకోవడం అనేది నా అదృష్టం

    నాకెంతో ఇష్టమైన వ్యక్తికి నేను సినిమా చేసుకోవడం అనేది నా అదృష్టం

    ఈ సినిమా నన్ను నమ్మి చేసినందుకు నిర్మాత లగడపాటి శ్రీధర్ గారికి సభా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుండో నాగబాబు గారికి సినిమా చేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజు ఆ అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకెంతో ఇష్టమైన వ్యక్తికి నేను సినిమా చేసుకోవడం అనేది నా అదృష్టం. అలాగే బన్నీ వాసుకు నా టార్చర్ భరించినందుకు థాంక్స్. ఈ సినిమాకు సంగీతం అందించిన విశాల్ శేఖర్, ఇంకా చాలా మందికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాల్సింది దర్శకుడు వక్కంతం వంశీ గారి గురించి.....ఈ సినిమాలో హీరోకు ఒకే ఒక గోల్ ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో బోర్డర్లో దేశానికి సేవ చేయాలని, ఆ ఒక్క ముక్క చెప్పి ఆయన నన్ను ఒప్పించారు. ఒక వ్యక్తి సమాజానికి అంకితం అనే ఒక జీవితం బ్రతకడం ఎంతో గొప్పది. అందుకే మిలటరీ అంటే చాలా రెస్పెక్ట్. మాకు షూటింగ్ సమయంలో ఇండియన్ ఆర్మీ వారు చాలా సపోర్ట్ చేశారు... అని బన్నీ తెలిపారు.

    ప్రత్యేక విమానంలో నా పేరు సూర్య చిత్ర బృందం

    నా పేరు సూర్య చిత్ర బృందంహైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో మిలటరీ మాధవరం చేరుకున్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, నాగబాబు తదితరులు ప్రైవేట్ జెట్లో ఇక్కడికి వచ్చారు.

    బన్నీ వాసు, ఎస్.కె.ఎన్

    ‘నా పేరు సూర్య' ఆడియో వేడుకలో పాల్గొనేందుకు వస్తూ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన నిర్మాతలు బన్నీ వాసు, ఎస్.కె.ఎన్.

    రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద

    అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలసుకుని భారీ సంఖ్యలో అభిమానులు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బన్నీతో పాటు అభిమానులు ర్యాలీగా మాధవరం బయల్దేరి వెళ్లారు.

    హైదరాబాద్ నుండి ప్రత్యేక వాహనాల్లో

    హైదరాబాద్ నుండి నా పేరు సూర్య స్టిక్కరింగ్‌తో కూడిన ప్రత్యేక వాహనాలు మిలటరీ మాధవరంలొ అందరి దృష్టిని ఆకర్షించాయి.

    సిద్ధమైన వేదిక

    ‘నా పేరు సూర్య' ఆడియో వేడుక కోసం సిద్ధమైనప వేదిక.

    English summary
    Naa Peru Surya Audio Launch LIVE updates. The film's team is planning to have its audio release event Today(April 22) at Military Madhavaram, West Godavari. The Allu Arjunstarrer has wrapped shooting and is gearing up for a worldwide release on May 4. Naa Peru Surya, Naa Illu India produced by Sirisha and Sridhar Lagadapati under the Ramalakshmi Cine Creations banner, written and directed by Vakkantham Vamsi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X