»   » ‘నా పేరు సూర్య’ ఫంక్షన్లో స్టేజీ వెనక జరిగిన గొడవేంటి? కుట్ర జరుగుతోందా?

‘నా పేరు సూర్య’ ఫంక్షన్లో స్టేజీ వెనక జరిగిన గొడవేంటి? కుట్ర జరుగుతోందా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఇటీవల జరిగిన 'నా పేరు సూర్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ మధ్య కుచించుకుపోయేలాగా... మనసుకు బాధ కలిగించే విధంగా, ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతో కొంత మదన పడేలాగా కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాల మీద మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మమ్మల్ని టార్గెట్ చేస్తూ కొంత మంది ఈ సినిమాను తప్పుతోవ పట్టించడానికో, మిక్డ్స్ టాక్ తీసుకురావడానికో, విమర్శించడానికో ప్రయత్నిస్తున్నారు అంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు.

  స్టేజీ వెనకాల జరిగిన గొడవ

  స్టేజీ వెనకాల జరిగిన గొడవ

  ఈ స్క్రీన్(స్టేజీ) వెనకాలే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అందుకే ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ స్టాండ్ తీసుకోవడానికి నమ్మకం మీరందరూ... సినిమా బావుంటే మీరే హర్షిస్తారు, మీరే ఆనందపడతారు. బన్నీ... నీకు ఈ విషయం తర్వాత చెబుతాను, కొన్ని విషయాలు జరుగుతున్నాయి నువ్వు దీనికి కనెక్ట్ కావొద్దు.... అని అల్లు అరవింద్ సూచించడం హాట్ టాపిక్ అయింది.


  స్టేజీ వెనకాల ఏం జరిగింది?

  స్టేజీ వెనకాల ఏం జరిగింది?

  ‘నా పేరు సూర్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లైవ్ కవరేజ్ చేయడానికి రెండు ఛానల్స్‌కు మాత్రమే అవకాశం ఇచ్చారు. అందులో ఒకటి ఈ చిత్రం శాటిలైట్‌రైట్స్ దక్కించుకున్న టీవీ ఛానల్ కాగా, మరొకటి పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే న్యూస్ ఛానల్. అయితే అనుమతి లేకున్నా..... ఓ ఛానల్ వారు కూడా ఈ వేడుకను కవరేజ్ చేయడానికి తమ లైవ్ కవరేజ్ వ్యాన్లను దించి తమకు ఎందుకు కవరేజ్ ఛాన్స్ ఇవ్వరు అంటూ గొడవ చేయడం ప్రారంభించారట.


  మీ సినిమాపై నెగెటివ్ పబ్లిసిటీ చేస్తామని వార్నింగ్

  మీ సినిమాపై నెగెటివ్ పబ్లిసిటీ చేస్తామని వార్నింగ్

  తమకు లైవ్ కవరేజ్ అవకాశం ఇవ్వక పోవడంతో సదరు ఛానల్ ప్రతినిధి ‘నా పేరు సూర్య' ఫంక్షన్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. లైవ్ ఫీడ్ ఇవ్వకుంటే ‘నా పేరు సూర్య'పై నెగెటివ్ స్టోరీస్ రాస్తామని వార్నింగ్ ఇచ్చారట.


  అల్లు అరవింద్ కల్పించుకుని

  అల్లు అరవింద్ కల్పించుకుని

  ఈ గొడవ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ అక్కడికి మెహర్ రమేష్, బన్నీ వ్యాస్‌లను పంపి పరిస్థితి సద్దుమనిగేలా చేశారని తెలుస్తోంది. ఈ సంఘటనను ఉద్దేశించే అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
  కుట్రలు చేధించే ప్రయత్నంలో మెగా టీమ్

  కుట్రలు చేధించే ప్రయత్నంలో మెగా టీమ్

  ‘నా పేరు సూర్య' సినిమాకు నష్టం కలిగించే విధంగా కుట్రులు జరుగుతున్న విషయాన్ని అల్లు అరవింద్, నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు. వీటిని చేధించే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మంచి సినిమాను ఎవరూ ఆపలేరనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.


  English summary
  Naa Peru Surya backstage fight hot topic. Allu Arvind's statement evoked mixed reaction as to what conspiracy he's talking about but this came from an incident that took place the backstage of Naa Peru Surya pre-release event. And here goes the hearsay about it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more