»   » ‘నా పేరు సూర్య’.... ఈ టాప్ 10 రికార్డులో ఎన్నింటిని పడగొడతాడో?

‘నా పేరు సూర్య’.... ఈ టాప్ 10 రికార్డులో ఎన్నింటిని పడగొడతాడో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ ఇండస్ట్రీలో రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించి పలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. టాలీవుడ్లో టాప్ 10 నాన్ బాహుబలి రికార్డుల్లో 8 రికార్డులను ఈ రెండు సినిమాలు బద్దలు కొట్టాయి. ఈ రెండు చిత్రాల తరహాలోనే 'నా పేరు సూర్య' కూడా భారీ విజయం సాధిస్తుందని అంతా భావిస్తున్న తారుణంలో.... టాలీవుడ్లోని టాప్ 10 రికార్డుల్లో ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందనే చర్చ మొదలైంది.

Naa Peru Surya Audience Review
యూఎస్ ప్రీమియర్స్ హయ్యెస్ట్ గ్రాసర్

యూఎస్ ప్రీమియర్స్ హయ్యెస్ట్ గ్రాసర్

తెలుగు సినిమాకు అతిముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్ యూఎస్ఏ. ఇక్కడ ప్రీమియర్ షోల ద్వారానే సగం కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్ రాబడుతుంటారు. ఇప్పటి వరకు $1,514,000 ప్రిమియర్ షో కలెక్షన్లతో అజ్ఞాతవాసి చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ఈ రికార్డును రంగస్థలం, భరత్ అనే నేను కూడా చెరిపేయ లేక పోయాయి.
వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఓపెనర్

వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఓపెనర్

ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో బిగ్గెస్ట్ ఓపెనర్ రికార్డ్ రూ. 60.50 కోట్లు. ఈ రికార్డు నమోదు చేసింది పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి'. దీన్ని రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు కూడా దాటలేక పోయాయి.


ఓపెనింగ్ వీకెండ్ హయ్యెస్ట్ గ్రాస్

ఓపెనింగ్ వీకెండ్ హయ్యెస్ట్ గ్రాస్

మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను తొలి వీకెండ్ రూ. 121 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మరి దీన్ని ‘నా పేరు సూర్య' అధిగమిస్తుందో? లేదో? చూడాలి.


ఫాస్టెస్ట్ రూ. 100 కోట్ల గ్రాస్

ఫాస్టెస్ట్ రూ. 100 కోట్ల గ్రాస్

ఫాస్టెస్ట్‌గా రూ. 100 కోట్ల వసూలు చేసి ‘భరత్ అనే నేను' రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం కేవలం 2 రోజుల్లోనే ఈ మార్కును అందుకుంది.


ఫాస్టెస్ట్ 2 మిలియన్ యూఎస్ఏ గ్రాసర్

ఫాస్టెస్ట్ 2 మిలియన్ యూఎస్ఏ గ్రాసర్

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ మార్కును అందుకున్న చిత్రంగా మహేష్ బాబు భరత్ అనే నేను రికార్డు నెలకొల్పింది.


హయ్యెస్ట్ యూఎస్ఏ గ్రాసర్

హయ్యెస్ట్ యూఎస్ఏ గ్రాసర్

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం' మూవీ యూఎస్ఏలో 3.5 మిలియన్ డాలర్ వసూలు చేసి నాన్ బాహుబలి కేటగిరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


ఓవర్సీస్ మార్కెట్లో టాప్ గ్రాస్

ఓవర్సీస్ మార్కెట్లో టాప్ గ్రాస్

ఓవర్సీస్ మార్కెట్లో రూ. 35 కోట్లకు పైగా వసూలు చేసి టాప్ గ్రాసర్‌గా రామ్ చరణ్, సుకుమార్ ‘రంగస్థలం' నిలిచింది. మరి దీన్ని నా పేరు సూర్య అధిగమిస్తుందో? లేదో? చూడాలి.


తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ గ్రాస్

తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ గ్రాస్

తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ గ్రాస్ రూ. 125 కోట్లు వసూలు చేసి ‘రంగస్థలం' టాప్ పొజిషన్లో ఉంది.


హయ్యెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాసర్

హయ్యెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాసర్

రూ. 203 కోట్లు వసూలు చేసిన ‘రంగస్థలం' ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. మరి ఈ రికార్డును ‘భరత్ అనే నేను' అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు. నా పేరు సూర్య ఈ రికార్డును అందుకుంటుందో? లేదో? చూడాలి.


14 రోజుల్లోనే రూ. 200 కోట్లు

14 రోజుల్లోనే రూ. 200 కోట్లు

కేవలం 14 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ‘భరత్ అనే నేను' చిత్రం రికార్డు నెలకొల్పింది. మరి ఈ రికార్డును ‘నా పేరు సూర్య' అధిగమిస్తుందో? లేదో? చూడాలి.


English summary
Stylish star Allu Arjun's Naa Peru Surya, Naa Illu India (NSNI) is set to release in the theatres on May 4. The movie is expected to be the next big hit at box-office after Rangasthalam and Bharat Ane Nenu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X