»   » అదరగొడుతున్న అల్లు అర్జున్.. కండలవీరుడిగా ఉగ్రరూపం..

అదరగొడుతున్న అల్లు అర్జున్.. కండలవీరుడిగా ఉగ్రరూపం..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun's New Look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకు పరిణితి కనబరుస్తూ అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఇప్పటికే రిలీజైన టీజర్, తదితర పోస్టర్లతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ట్వీట్ చేసిన ఓ పోస్టర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్ నోట్లో సిగార్‌తో

అల్లు అర్జున్ నోట్లో సిగార్‌తో

తాజాగా వైరల్‌గా మారిన పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ భీభత్సంగా ఉంది. నోట్లో సిగార్ పెట్టుకొని తీవ్రమైన లుక్స్‌తో అల్లాడించాడు. ఇక మిలటిరీ కటింగ్‌తో జీపులో కూర్చొని ఉన్న స్టైలిష్ స్టార్ బాడీ హాలీవుడ్ హీరో ధీటుగా కనిపించింది.

కండలు తిరిగిన యోధుడిగా

కండలు తిరిగిన యోధుడిగా

నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ద పెట్టి బాడీ బిల్డింగ్ చేశాడు. కండలు తిరిగిన చేయి ఫ్యాన్స్‌కు కేక పుట్టించేలా ఉంది. మిలటరీ ఆఫీసర్ అంటే ఇలానే ఉంటాడు అనే విధంగా అల్లు అర్జున్ తన బాడీని సరిదిద్దుకొన్నాడు.

అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్

అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్

సినిమాలోని పాత్ర తగినట్టుగా తన శరీరాకృతిని మార్చుకొనేందుకు అల్లు అర్జున్ అమెరికాలో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ పాత్ర కోసం విపరీతంగా శ్రమ పడినట్టు చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.

సైనికుడిగా స్టైలిష్ స్టార్

సైనికుడిగా స్టైలిష్ స్టార్

నా పేరు సూర్య చిత్రంలోఅల్లు అర్జున్ భారతీయ సైన్యంలో పనిచేసే ఆఫీసర్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేసినట్టు టీజర్‌లో స్పష్టమైంది.

వక్కంతం వంశీ దర్శకత్వం

వక్కంతం వంశీ దర్శకత్వం

కథ, మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకత్వం బాధ్యతలు చేపట్టి నా పేరు సూర్య అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. శిరీష రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌పై లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్

ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్

నా పేరు సూర్య చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే అదే రోజు రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం రిలీజ్ కానుండటంతో రిలీజ్ డేట్‌ను మార్చుకొన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర విడుదలను ఏప్రిల్ 20 తేదీగా నిర్ణయించారు.

English summary
Allu Arjun is oozing a lot of swag in the latest poster of his upcoming film, Naa Peru Surya, which has been dropped today. In the photo that was shared by Allu Shirish on his Twitter account, we see him with his shades on, smoking a cigar as he drives a big mean machine. And that cut in his eyebrow which is a part of the look of this film is certainly unmissable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu