»   » నా పేరు సూర్య భారీ సైకత శిల్పం.. బన్నీ బర్త్ డే సందర్భగా వైజాగ్ బీచ్‌లో!

నా పేరు సూర్య భారీ సైకత శిల్పం.. బన్నీ బర్త్ డే సందర్భగా వైజాగ్ బీచ్‌లో!

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నేడు 35 వ పడిలోకి అడుగుపెట్టాడు. బన్నీ జన్మదినం నేడు. గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తన నటన, డాన్సులతో ప్రత్యేకంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. బన్నీ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బన్నీ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య. వక్కంతం వంశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బన్నీ ఈ చిత్రంలో ఆర్మీ మాన్ గా అలరించబోతున్నాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో వైజాగ్ బీచ్ లో భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ సైకత శిల్ప కారుడు మానస్ సాహు ఈ శిల్పాన్ని రూపొందించాడు. నా పేరు సూర్య చిత్ర టైటిల్ మరియు అల్లు అర్జున్ చిత్రాన్ని రూపొందించారు.

Naa Peru Surya Sand art by manas sahu

మానస్ సాహు రాష్ట్రపతి అవార్డు గ్రహీత కావడం విశేషం. మానస్ సాహు తీర్చి దిద్దిన ఈ ఈ శిల్పం చూపరులని ఆకట్టుకుంటోంది. నా పేరు సూర్య చిత్రం మే 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Naa Peru Surya Sand art by manas sahu. Allu arjun 35th birthday today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X