»   » బ్యాంకాక్‌లోని అందమైన లోకేషన్స్‌లో రితికతో స్టెప్పులేసిన కృష్ణుడు

బ్యాంకాక్‌లోని అందమైన లోకేషన్స్‌లో రితికతో స్టెప్పులేసిన కృష్ణుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణుడు హీరోగా మాస్టర్ హేమచంద్రా రెడ్డి, బేబీ హేమశ్రీ సమర్పణలో శ్రీ శివపార్వతి కంబైన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నాకూ ఓ లవరుంది పాటలతో సహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె. సురేష్ బాబు మాట్లాడుతూ - తాము అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని, ఇటీవల బ్యాంకాక్, పటాయలలో హీరో కృష్ణుడు, హీరోయిన్ రితికలపై నాలుగు పాటలు చిత్రీకరించామని, ఇప్పటి వరకు ఎవరూ చేయని పలు అందమైన, రిచ్ లోకేషన్స్‌లో ఈ పాటల్ని చిత్రీకరించామని, కెఎం రాధాకృష్ణన్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారని అన్నారు.

ఈ నెలాఖరులో చిత్రం ఆడియోను భారీ యెత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణుడు, రితక, ఎంఎస్ నారాయణ, సురేష్, అలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్, మాస్టర్ భరత్, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్, ధనరాజ్, ఖడ్గం పృథ్వీ, పొట్టి రాంబాబు, తాగుబోతు రమేష్, గుండు హనుమంతరావు, రఘు కారుమంచి ఈ చిత్రంలో నటించారు. కథ, మాటలు రాఘవ సమకూర్చారు, లక్ష్మీభూపాల్, పెద్దాడ మూర్తి పాటలు రాశారు.

English summary
Naaku O loverundi film shootong is completed. It is in post production. It will be released in July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu