»   » ఈ షార్ట్ ఫిలిం చూసి, రైటర్ గా సినిమా ఆఫర్ ఇచ్చారు (వీడియో)

ఈ షార్ట్ ఫిలిం చూసి, రైటర్ గా సినిమా ఆఫర్ ఇచ్చారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ లు ఈ రోజున ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కు తమ వృత్తిలో తామేంటో తెలుసుకునే సాధనాలు. అంతేకాదు ఆ షార్ట్ పిల్మ్ లే ఒక్కోసారి ఆఫర్స్ సైతం తెచ్చిపెడుతున్నాయి. తెలుగులో షార్ట్ ఫిలిం చేసి డైరక్టర్ గా ఛాన్స్ కొట్టి సక్సెస్ అయి ఎదుతున్నవాళ్లు ఉన్నారు.

ముఖ్యంగా తెలుగులో పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు సైతం షార్ట్ పిల్మ్ లు చేసే యువకుల వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. టాలెంట్ హంట్ లు పెట్టకుండా చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ నుంచే వారి టాలెంట్ ఎంతో చూడవచ్చు కదా.

 Naathicharaami short film director get movie Chance

కాకపోతే చిన్ని సినిమా లాంటి షార్ట్ ఫిల్మ్ ని డైలాగులతో నింపేస్తే, డైరక్టర్ గా ఛాన్స్ లు వస్తాయా...లేక డైలాగు రైటర్స్ గా ఛాన్స్ లు వస్తాయా. రీసెంట్ గా నాతి చరామి అనే షార్ట్ ఫిలిం విడుదలైంది. ఈ షార్ట్ ఫిలిం యూత్ లోకి బాగానే వెల్తోంది. అయితే ఆ షార్ట్ ఫిలిం మొత్తం డైలాగులతో నింపేసాడు దర్శకుడు.

దాంతో ఈ షార్ట్ ఫిలిం చూసిన వారికి డైలాగులు బాగున్నాయి కానీ ఇన్ని డైలాగులా అని అనిపిస్తే... తెలుగులో పేరున్న ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీవారికి మాత్రం ఇందులో డైలాగులు చాలా బాగున్నాయి..విజువల్స్ ,కంటెంట్ వదిలేస్తే అని అనిపించి తమ చిత్రానికి డైలాగులు రాయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. వారు యంగ్ హీరోలతో వరస పెట్టి సినిమాలు తీస్తున్న ప్రొడక్షన్ కంపెనీ.

తమ సినిమాలో కొన్ని సీన్స్ ఇచ్చి తమకు అనుకూలంగా అవుట్ పుట్ ఇస్తే ...అతన్నే డైలాగు రైటర్ గా పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నారట. అన్నీ అనుకున్నది అనుకున్నట్లు అయితే ఈ డైరక్టర్ కు ఓ మంచి ఆఫర్ వచ్చినట్లే. అసలే ఇప్పుడు రైటర్స్ నుంచి డైరక్టర్ గా మారుతున్న వారి సీజన్ నడుస్తోంది. బెస్టాఫ్ లక్ క్రాంతి కుమార్.

English summary
Naathicharaami telugu short film director Kranthi Kumar get movie Chance as a dailouge writer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu