For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛార్టెడ్ ప్లైట్ లో ఈ రోజే 'నాయక్' సక్సెస్ టూర్..డిటేల్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'నాయక్' ఘన విజయాన్ని పురస్కరించుకుని హీరో రాంచరణ్, డైరెక్టర్ వి.వి. వినాయక్ రాష్ట్రంలో ఒకరోజు విజయయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 20న ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో థియేటర్ల వద్ద ప్రేక్షకుల్ని కలుసుకుంటారని ఆ చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్య, సమర్పకుడు యస్. రాధాకృష్ణ తెలిపారు.

  సక్సెస్ టూర్ షెడ్యూల్..
  వైజాగ్ లోని విమాక్స్ థియోటర్ కు ఉదయం 10 గంటలకు
  తర్వాత గాజువాకలోని లక్ష్మి థియోటర్ కు

  రాజమండ్రి 12. 30 కు
  గీతా ఆప్సర, ఊర్వశి థియోటర్స్ కు

  విజయవాడ 2.30 కు
  రాజ్,అన్నపూర్ణ థియోటర్స్ కు

  తిరుపతి 7.00 కు

  ప్రతాప్ గ్రూప్ థియోటర్స్ కు..

  ఇలా ఒకే రోజులో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాలలో ఈ టూర్ ని నిర్వహించనున్నారు. 'నాయక్‌' సినిమా హీరో రామ్‌చరణ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌, తదితర యూనిట్‌ సభ్యులు ఆదివారం విశాఖ నగరానికి చేరుకొంటారని చిరంజీవి రక్తనిధి కేంద్రం ఛైర్మన్‌ రాఘవరావు తెలిపారు. వీజేఎఫ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు రామ్‌చరణ్‌, దర్శకులు వినాయక్‌ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని సత్యం కూడలి, వీఐపీ రోడ్డు, సిరిపురం, జగదాంబ మీదుగా వీమాక్స్‌ థియేటర్లో జరిగే 'నాయక్‌' విజయోత్సవ సభకు హాజరవుతారన్నారు.

  అక్కడి నుంచి గాజువాక వెళతారని పేర్కొన్నారు. విడుదలైన వారం రోజుల్లోనే 'నాయక్‌' చిత్రం అంతకుముందున్న మగధీర, గబ్బర్‌సింగ్‌ కలెక్షన్‌ రికార్డులను తిరగరాసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, రాజమండ్రి విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ చిత్రం విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నామని, చరణ్‌ అభిమానులు, మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.

  రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్' సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ అయ్యింది. రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేసారు. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఎస్.ఎస్ తమన్ అందించిన ఈ చిత్రం ఆడియో అభిమానులను అలరిస్తోంది. అలాగే ...సినిమాలో ...నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను... ,ముఖ్యంగా... ఏరియా బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు...కరేజ్, ప్రభత్వం కోసం ప్రజలు ఉండరు..ప్రజలు కోసమే ప్రభుత్వం ఉండాలి, వంటి డైలాగ్స్ చరణ్ అభిమానులను ఓ రేంజిలో అలరిస్తున్నాయి.

  మాస్ హీరోయిజాన్ని చాలా పవర్‌ఫుల్‌గా, హార్ట్ టచింగ్‌గా ప్రెజెంట్ చేయడంలో వినాయక్‌ది అందె వేసిన చేయి. చిరంజీవిని 'ఠాగూర్'గాను, అల్లు అర్జున్‌ని 'బన్నీ'గాను, 'బద్రినాథ్'గానూ ఆవిష్కరించిన వినాయక్ ప్రస్తుతం రామ్‌చరణ్‌ని 'నాయక్'గా తీరిదిద్ది మెగాభిమానులను మరోసారి అలరించారు. 'మగధీర' తర్వాత రామ్‌చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ఇది. రామ్‌చరణ్, వినాయక్ చిత్రానికి తమన్ స్వరాలందించడం ఇదే ప్రథమం. చిరంజీవి ఒకప్పటి హిట్ సినిమా 'కొండవీటి దొంగ'లోని ప్రాచుర్య గీతం 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..'ను ఇందులో రీమిక్స్ చేసి రామ్‌చరణ్, అమలాపాల్‌పై చిత్రీకరించారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఛార్మి ఓ పాటలో ఐటమ్‌గాళ్‌గా చేసింది. 'ఒయ్యారమంటే ఏలూరే..' పాటను రామ్‌చరణ్, ఛార్మిపై చిత్రీకరించారు.

  ఆకుల శివ మంచి స్క్రిప్ట్ ఇచ్చారని, వినాయక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, రామ్‌చరణ్ తన మెగా పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారని నిర్మాత చెప్పారు. యూనివర్శల్ మీడియా పతాకంపై ఎస్. రాధాకృష్ణ సమర్పలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

  English summary
  
 
 Ram Charan, Kajal, Amala Paul starrer 'Nayak' directed by VV.Vinayak turned out to be super hit. Now the film makers decided to go on success tour. Ram Charan and Vinayak will be touring AP on 20th of this month. In a special chartered plane they will be delighting fans in Vizag, Rajahmundry, Tirupathi by meeting audience in theaters. Producer DVV.Danayya and presenter S.Radhakrishna informed the news in a press release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X