twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్ ప్యాకెడ్ (‘నాయక్’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మాస్ డైరక్టర్ వివి వినాయిక్, మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మెగా వారసుడు రామ్ చరణ్ తేజ కాంబినేషన్ చిత్రం ప్రారంభమైన నాటి నుంచే అన్ని వర్గాల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలను భారీగా మోసుకు వస్తూ 'నాయక్' ఈ రోజు భారీగా థియోటర్స్ లో దిగుతోంది. యాక్షన్,ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆడియో సైతం మంచి విజయాన్ని సాధించి చిత్రంపై అంచనాలు పెంచేసింది.

    చిత్రంలో చెర్రీ (రామ్ చరణ్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి జిలేబి(బ్రహ్మానందం) అనే అంకుల్ ఉంటాడు. జిలేబి అనుకోకుండా లోకల్ డాన్ అయిన గండిపేట బాబ్జి (రాహుల్ దేవ్) తో గొడవ పడతాడు. ఈ గొడవ నుండి జిలేబి ని కాపాడే ప్రాసెస్ లో చెర్రీ, బాబ్జి చెల్లెలు అయిన మధు (కాజల్) ని ప్రేమిస్తాడు. మరో ప్రక్క హైదరాబాద్ మరియు కోల్ కత్తాలలో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మినిస్టర్ రావత్ ని చెర్రీ చంపెయబోతున్నాడు అని సిబిఐ టీం (ఆశిష్ విద్యార్థి) చెర్రీ కోసం వెతకడం మొదలు పెడుతుంది. దీంతో కథలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ నుండి మనకి కథ డైవర్షన్ మారుతుంది. చెర్రీ సి బి ఐ నుండి ఎలా తప్పించుకున్నాడు? తను నిరపరాధి అని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే మిగిలిన కథ.

    చిత్రం గురించి దర్శకుడు వివి వినాయిక్ మాట్లాడుతూ.... ''నిర్మాత 3ఏళ్ల కృషి ఇది. యజ్ఞంలా కష్టించి పనిచేశారు. ఇటీవలే సెన్సార్‌ పూర్తయింది. వారి నుంచి చక్కని స్పందన వచ్చింది. ఇప్పటికే 20మంది బైటివారు సినిమాని చూసి చాలా బావుందని ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. హీరో,హీరోయిన్స్ ల నటనతో పాటు బ్రహ్మీ, జేపీల కామెడీ, తమన్‌ సంగీతం హైలైట్‌గా ఉంటాయి'' అన్నారు.

    నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ-''చిరుతో సినిమా తీయలేకపోయానే అనే బాధ ఇంతకాలం ఉండేది. ఈ సినిమాతో అది తీరింది. చరణ్‌తో పనిచేస్తే చిరుతో సినిమా తీసినట్టే ఉంది. చరణ్‌ చిరంజీవిలా ఉన్నాడు. హిట్‌ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం'' అన్నారు.

    నటీనటలు: రామ్ చరణ్, కాజల్, అమలపాల్ , బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు
    సంగీతం: తమన్,
    కెమెరా: చోటా కె. నాయుడు,
    కథ, మాటలు: ఆకుల శివ,
    నిర్మాత: డివివి దానయ్య,
    దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    The most anticipated Tollywood movie of 2013, Naayak is directed by VV Vinayak, which features Ram Charan Teja, Kajal Aggarwal and Amala Paul in the lead roles. “Nayyak” is promoted with a tag line ‘The Leader’ by the makers of the film to prove that Ram Charan Teja is the leader in Tollywood among the present day heroes.The film is slated to release on January 9, 2013; the makers are concentrating on the Sankranthi weekend for better collections of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X