For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబుల్ కిక్ ...'నాయక్' (మరో రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వినాయిక్,రామ్ చరణ్ కాంబినేషన్ 'నాయక్' వారు పండగ చేసుకునే ఎలిమెంట్స్ తో వచ్చేసింది. రామ్ చరణ్ తనదైన శైలిలో డాన్స్ లు, తన స్టైల్ ఫైట్స్, పంచ్ లు ఇచ్చుకుంటూ పోయి సంక్రాంతి వాతావరణం ముందే తెచ్చేసాడు. మాస్ పల్స్ తెలిసిన దర్సకుడుగా వివి వినాయిక్ తనను తాను మరో సారి ప్రూవ్ చేసుకున్న ఈ చిత్రం రచ్చ రేంజిని దాటుతుందని, ఈ సంవత్సరంలో సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచేలా ఉంది.

  ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ లో ముఖ్యంగా వినాయిక్ కామెడీనీ బాగా బేస్ చేసుకున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం ఫ్యాన్స్ కు పండుగ అయితే, కామెడీ...రెగ్యులర్ సినీ గోయిర్స్ కు ఊపు తెచ్చింది. బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ పంచ్ డైలాగ్స్ కు థియోటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి.

  చిత్రం ప్రారంభం నాయక్ ఇంట్రడక్షన్....కలకత్తాలో జరుగుతుంది. అక్కడ తన వారికోసం ఏమైనా చేసే నాయక్ గా రామ్ చరణ్ ఫైట్ తో అల్లాడించాడు.

  నాయక్ పోలికలతో ఉండే చెర్రీ (మళ్లి రామ్ చరణ్) ఇంట్రడక్షన్ సాప్ట్ వేర్ ఇంజినీర్ గా కూల్ గా జరుగుతుంది. కలకత్తాలో ఉండేవాడూ ఇక్కడ ఉండేవాడు ఒకడేనా....అయితే అక్కడ హత్యలు చేసి ఇక్కడ సాప్ట్ వేర్ ఇంజినీరుగా చేస్తున్నాడా అనే డౌట్ తో కథ స్పీడు అందుకుంటుంది.

  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చెర్రీ తన అంకుల్ జిలేబి(బ్రహ్మానందం) అత్యుత్సాహంతో నోరు జారి,ఇరుక్కోవటంతో లోకల్ డాన్ గండిపేట బాబ్జి (రాహుల్ దేవ్) దగ్గరకు సెటిల్ మెంట్ కు వెళ్లాళ్సి వస్తుంది. అయితే బాబ్జిని కలిసిన చెర్రికి అక్కడ బాబ్జీ చెల్లెలు మధు (కాజల్) తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దాంతో బాబ్జీని మాటలతో మభ్యపెట్టి ప్రస్తుతానికి ఆ గండం నుండి గట్టెక్కి, మధుని లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తూంటాడు.

  పనిలో పనిగా మధూతో పాటలు కూడా పాడేస్తూంటాడు.

  మరోప్రక్క కలకత్తాలో,హైదరాబాద్ లలో చెర్రి పోలికలతో ఉన్న ఓ వ్యక్తి హత్యలు చేస్తూంటాడు. అతని కోసం సిబిఐ (ఆశిష్ విధ్యార్ధి)టీం వెతుకుతూంటుంది. ఇంతలో ఆ చెర్రి పోలికలతో ఉన్న మరో వ్యక్తి...నెక్ట్స్ మర్డర్ చేయబోయేది మినిస్టర్ రావత్ (ప్రదీప్ రావత్)అని తెలుస్తుంది.

  కుంభమేళాలో అతన్ని చంపబోతున్నాడని తెలుసుకున్న సీబీఐ అక్కడకి చేరుకుంటుంది. సరిగ్గా అదే సమయానకి చెర్రీ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు సీబీఐ వారు చెర్రీని చూసి ఆరెస్టు చేయటానికి సిద్దమవుతారు... అప్పుడు మరో నాయక్ రివిల్ అవుతాడు. అంటే రెండో హీరో ఉన్నాడన్నమాట...ఇంతకీ నాయక్ ఎవరు..

  నాయక్ కీ,అమలా పాల్ కి రిలేషన్ ఏమిటి..ఎందుకు నాయక్ హత్యలు చేస్తున్నాడు అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  సినిమా హైలెట్స్ లో బ్రహ్మానందం జిలేబీ గా చేసిన కామెడీ హైలెట్

  వినాయిక్ కి యాక్షన్ ఎపిసోడ్స్ కి పెట్టింది పేరు. ఈ చిత్రంతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది.

  ఛోటాకె.కెమెరా వర్క్ సినిమా ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలిచింది.

  నిర్మాత డివివి దానయ్య నిర్మాణ విలువలు,రాజీపడని తత్వం సినిమాని ఉన్నత స్ధాయిలో నిలిపింది

  సినిమా లో హింస ఉన్నా అది మోతాదులో ఉండటం, మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ ఉండటం,కామెడీ సినిమా విజయానికి ప్లస్ అయ్యాయి

  రామ్ చరణ్ డాన్స్ లు సినిమా హైలెట్స్ లో ఒకటి. డాన్స్ లలో తన తండ్రిని మించిపోయేలా ఉన్నాడని అందరినోటా వినపడుతోంది

  సెకండాఫ్ లో అమలా పాల్ పై తీసిన 'శుభలేఖ రాసుకొన్నా' రాసుకున్నా పాట..మెగా అబిమానులును ఉర్రూతలూగిస్తోంది

  మగధీర కాంబినేషన్ కాజల్, రామ్ చరణ్ పెయిర్ మరోసారి తెరపై కనపడటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

  ఇక 'శుభలేఖ రాసుకొన్నా' అనే పాట అయితే తన తండ్రి చిరంజీవి ని స్టెప్స్ లో దాటిపోయేలా చేసారు. సినిమా రిలీజ్ కు ముందు నెగిటివ్ టాక్ వినిపించినా రిలీజ్ అయ్యాక అన్ని చోట్ల నుంచి పాజిటివ్ గా హిట్ అనే వినిపిస్తోంది. ఏ రేంజి హిట్ అనేది తేలటానికి కొంత టైమ్ పట్టవచ్చు.

  బ్యానర్ : యూనివర్శల్ మీడియా సంస్థ

  నటీనటలు: రామ్ చరణ్, కాజల్, అమలపాల్ , బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు

  సంగీతం: తమన్,

  కెమెరా: చోటా కె. నాయుడు,

  ఎడిటింగ్: గౌతంరాజు,

  ఆర్ట్: ఆనంద్‌ సాయి

  కథ, మాటలు: ఆకుల శివ,

  సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ.

  నిర్మాత: డివివి దానయ్య,

  దర్శకత్వం: వివి వినాయక్.

  English summary
  The Sankranthi festival season has begun with the release of Ram Charan Teja’s “Naayak” in the Telugu film industry. Ram Charan gave a big hit with Racha last year, now he is back with Naayak. For the movie, Naayak, made at a budget of 35 crore, Ram Charan has joined with director VV Vinayak to give yet another hit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X