»   » మహేష్ బాబు అక్క పాత్రలో పవర్ స్టార్ అత్త!

మహేష్ బాబు అక్క పాత్రలో పవర్ స్టార్ అత్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'మిర్చి' చిత్రంలో అమ్మ పాత్రలో సూపర్ అపినించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రంలో అత్త పాత్రలో అదరగొట్టింది. త్వరలో రాబోతున్న ఆగడు చిత్రంలో మహేష్ అక్క పాత్రలో అలరించబోతోంది. ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి నదియా. మహేష్ బాబు అక్కగా నదియా పాత్ర ఈచిత్రంలో కీలకం కానుంది.

'ఆగడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం బళ్లారిలో జరుగుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ స్క్రిప్టు అందించారు. మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు.

Nadhiya Moidu Playing Mahesh Babu's Sister In Aagadu

నదియా, మహేష్ బాబు కలిసి నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆగడు చిత్రంలోనూ ఆమె తనదైన ముద్ర వేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మళయాలం మూవీ దిృశ్యం తెలుగు రీమేక్‌లో కూడా ఆమె ఎంపికైంది.

ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబు, శ్రీనువైట, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ కాంబినేషన్లో 'దూకుడు' వంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆగడు చిత్రాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Nadhiya Moidu is one of the most popular actresses in South India. In recent years, the yesteryear actress has been seen playing side characters in a few Telugu movies. She was Rebel Star Prabhas' mother in Mirchi and Power Star Pawan Kayan's aunt in Attarintiki Daredi. Now, she is all set to comeback as Superstar Mahesh Babu's sister in his upcoming movie Aagadu, which is currently being shot in Bellary.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu