»   » పవన్ కళ్యాణ్ అత్తతో...రామ్ చరణ్ సెల్ఫీ (ఫోటో)

పవన్ కళ్యాణ్ అత్తతో...రామ్ చరణ్ సెల్ఫీ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. ఇందులో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ చెల్లి పాత్రలో కృతి కర్భంద నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అత్తాంటికి దారేది' చిత్రంలో అత్త పాత్రలో నటించిన నదియా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఆమె ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లిగా నటిస్తోందా? లేక మరేదైనా పాత్రలో నటిస్తుందా? అనేదానిపై సరైన క్లారిటీ లేదు. తాజాగా రామ్ చరణ్, నదియా, కృతి కర్భంద బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతుండగా తీసుకున్న సెల్ఫీ ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

Nadia in Ram Charan movie

త్వరలోనే ఈ సినిమాకు టైటిల్ ప్రకటించనున్నారు. రామ్ చరణ్ ఇందులో స్టంట్ మాస్టర్ గా కనిపించబోతున్నాడు. ‘మై నేమ్ ఈజ్ రాజు', ‘బ్రూస్ లీ' అనే టైటిల్స్ గతంలో వినిపించాయి. అయితే ఇటీవలే జివి ప్రకాష్ సినిమాకు ‘బ్రూస్ లీ' అనే టైటిల్ ప్రకటించారు. మరి రామ్ చరణ్ కు ఏ టైటిల్ పెడతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రతినాయకుడి పాత్రలో తమిళ నటుడు అరుణ్ విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘ఎంత వాడు గానీ' చిత్రంలో అరుణ్ విజయ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. దీంతో అరుణ్ విజయ్ ని రామ్ చరణ్ సినిమాలోకి తీసుకున్నారు. అతను రామ్ చరణ్‌కు పర్ ఫెక్టుగా సూటయ్యే విలన్ అని తెలుగు సినీ వర్గాల్లో చర్చసాగుతోంది. కాగా సినిమాలో తన పాత్ర కోసం రామ్ చరణ్ థాయ్ లాండ్ వెళ్లి కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

English summary
Whether Nadia is playing Ram Charan's mother or not is yet to be known, but today she was spotted on the sets of this Sreenu Vytla directorial at Bangkok.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu