»   » మమతపై మనసు పారేసుకొన్న నాగార్జున!

మమతపై మనసు పారేసుకొన్న నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువసామ్రాట్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం తపించే సినిమాలను సెలక్ట్ చేసుకొంటారు. ఆయన 'కేడి" సినిమాతో తన స్టయిల్ ని సూర్తిగా మార్చేశారు. రొమన్స్ ని బాగా తగ్గించి విలక్షణమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు రమేష్. అతడిని అందరూ రమ్మీ అని పిలుస్తుంటారు. జాదు పనులు చేసే ఈ కేడి పాత్ర ఖచ్చితంగా ఇప్పటికి ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆయన అంటున్నారు.

అలాగే నాగార్జున సరసన 'కేడి" సినిమాలో కథానాయికగా నటించిన మమతామోహన్ దాస్ ఈ హీరోగారిని ఫుల్ గా ఇంప్రెస్ చేసిందని, స్వయంగా నాగార్జుననే మమతాకు కితాబులిస్తూ 'ఐ లవ్ హర్. ఎందుకంటే వర్క్ విషయంలో తను చాలా డెడికేటెడ్. అలాగే ఆ అమ్మాయిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. పాటలు పాడుతుంది..డ్యాన్స్ చేస్తుంది. నటనలో ఫర్ ఫెక్ష్న్ రావటం కోసం కష్టపడుతుంది. వీటితో పాటు హెల్త్ విషయంలోనూ, ఫిగరమెయింటెన్ చేయటంలోనూ మమతాను చూసి అందరూ నేర్చుకోవాల్సిందే" అని చెప్పాడు నాగార్జున.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu