»   » 'మనం' ట్రైలర్ రెండు రోజుల్లోనే...

'మనం' ట్రైలర్ రెండు రోజుల్లోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఇటీవల 'మనం' ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని అంతర్జాలంలో తొలి రెండు రోజుల్లో ఆరున్నర లక్షల మంది వీక్షించారు.

ఈసందర్భంగా నాగార్జున మాట్లాడుతూ "ఇటీవల విడుదలైన మనం ట్రైలర్స్ కు మంచిరెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. నాన్నగారు నటించిన చివరి చిత్రం కాబట్టిసినిమా మీద అంచనాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమాఅవుతుంది అనిపిస్తోంది.ఇది పూర్తి కుటుంబ సభ్యులతో చూడతగ్గ చిత్రం లా ఉంటుందని చాలా మందిఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు. నాన్న,నేను, చైతన్య కలిసి నటించిన ఈ సినిమానుఅన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో ఓ ప్రెస్టీజియస్ సినిమా గా దర్శకులు విక్రమ్ కుమార్ రూపొందించారుసినిమా ఆడియోను ఈ నెలలో నే విడుదల చేసి సినిమానుమే నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము'' అన్నారు

Nag flooded with compliments for Manam trailer

అలాగే ...కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం అంటున్నారు నాగార్జున. '' 'ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమాలా ఉంది' అంటున్నారంతా. నిజంగానే ఇది అలాంటి సినిమానే. మనందరి ప్రేమకథని 'మనం'లో చూడొచ్చు. మా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. త్వరలో పాటల్ని వినిపిస్తాము''అన్నారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. మిగిలిన పాత్రల్లో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అలీ,ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, నాగినీడు, శరణ్య
కాశీవిశ్వనాధ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌, మాటలు: హర్షవర్థన్‌, పాటలు: చంద్రబోస్‌, వనమాలి

English summary
Nagarjuna is extremely happy with the tremendous response for the trailer of Manam which was released recently. "Everyone was raving about it and friends in the industry have been calling me to congratulate. So happy to see the exciting mood," he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu