»   »  ‘నాగ్ గాడు అంతా కొట్టేసాడు’...వెంకీ స్పీచ్ (వీడియో)

‘నాగ్ గాడు అంతా కొట్టేసాడు’...వెంకీ స్పీచ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వంగవీటి' డిసెంబర్‌ 23న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా 'శివ టు వంగవీటి ది జర్నీ ఆఫ్‌ రామ్‌ గోపాల్‌ వర్మ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

హైదరాబాద్ లోని జెఆర్‌ సీ కన్వెషన్‌ హాల్‌ లో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా నాగార్జున వెంకటేష్‌ సహా పూరి జగన్నాథ్‌, గుణశేఖర్‌, వై.వి.ఎస్‌.చౌదరి, వంశీ పైడిపల్లి, జీవిత, డా.రాజశేఖర్‌ సహా పలువురు హాజరయ్యారు.

Nag Gaadu Chain Laagi Antha Kottesadu : Venkatesh

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ...'శివ' సినిమా తర్వాత వర్మతో ఓ సినిమా చేయాలని అనుకున్నాం. శివ లాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను. శివ కన్నా బాబులాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను. కానీ 'క్షణం క్షణం' అనే డిఫరెంట్ సినిమా తీసాడు. నాగ్ తో చైన్ అలా లాగించాడు. నా సినిమాలో నన్నుపక్కన కూర్చొబెట్టి సాంగ్‌ అంటూ శ్రీదేవితోనే షూటింగ్‌ చేసేవాడు... అని అప్పటి రోజులను వెంకటేష్ గుర్తు చేసుకున్నాడు.

తర్వాత ఓ రోజు రామ్ గోపాల్ వర్మ నా దగ్గరికి వచ్చి....... శ్రీదేవితోనే ఎక్కువ సీన్స్ చేస్తున్నాడు. నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని బయట అనుకుంటున్నారు. నువ్వేమైనా ఫీలయ్యావా..? అలాంటిదేమైనా ఉంటే హానెస్ట్‌గా చెప్పు అని రాము అడిగారు. అలాంటిదేమీ లేదు అని చెప్పాను అని వెంకీ గుర్తు చేసుకున్నారు.

మిగిలిన హీరోలందరం ఎన్ని ఫైట్స్‌ చేసినా నాగ్‌గాడు ఒక్క ఛైన్‌ లాగి మొత్తం కొట్టేసాడ్రా అనుకునేవాళ్లం. శివ తర్వాత నుంచి ఫైట్స్‌ స్టైలే మారిపోయింది.. అని వెంకటేస్ 'క్షణం క్షణం' నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

English summary
Venkatesh Speech at The Journey of Ram Gopal Varma from Shiva to Vangaveeti, on RGV channel. The event is graced by Nagarjuna, Venkatesh, SS Rajamouli, Puri Jagannadh, Vamsi Paidipally, B Gopal and many other celebrities. The Journey of RGV from Vijayawada to Nagarjuna and then to Amitabh Bachchan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu