»   » నాగ్ ‘ఊపిరి’ విడుదల తేదీ పోస్టర్

నాగ్ ‘ఊపిరి’ విడుదల తేదీ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఊపిరి' . ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు విడుదల తేదీని ఫైనలైజ్ చేస్తూ పోస్టర్ వదిలారు నిర్మాతలు. ఈ పోస్టర్ ప్రకారం మార్చి 25, 2016 న ఈ చిత్రం విడుదల కానుంది.

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.


Nag - Karthi's Oopiri release date poster

ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ మధ్యన చిత్రం మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని మరో సారి చూడవచ్చు.కథకనుగుణంగా ఈ టైటిల్‌ను ఓకే చేసిన్నట్టు సమాచారం. గ్లామర్ తార తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.


''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.


''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.


ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.


English summary
Nagarjuna - Karthi film's Titled Oopiri makers have already announced the release date - March 25, 2016. Now the production house PVP Cinema has released poster with the release date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu