»   » నిజమా..! రూమరా? నాగ్‌, నిఖిల్‌ మల్టీస్టారర్‌?

నిజమా..! రూమరా? నాగ్‌, నిఖిల్‌ మల్టీస్టారర్‌?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్‌హీరో నిఖిల్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరో. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించాడు. దాంతో చాలామంది నిర్మాతలు నిఖిల్‌తో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు. కాగా, నిఖిల్‌ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ సినిమాను అంగీకరించినట్టు తెలుస్తోంది. సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే స్టార్ కింగ్ నాగార్జున. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ నుంచి భక్తిరస చిత్రాల వరకు.. ఇప్పటికీ అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్న నాగార్జున, యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో కొన్ని సినిమాలో గెస్ట్ అపియరెన్స్ లు ఇచ్చిన ఈ మన్మథుడు.. ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడట.

Nag and Nikhil Multi-Starrer On Cards

'కింగ్‌' నాగార్జునతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు నిఖిల్‌ అంగీకరించాడట. ఈ సినిమాకు నిఖిల్‌తో 'కార్తికేయ', నాగచైతన్యతో 'ప్రేమమ్‌' సినిమాలు చేసిన . దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ నచ్చడంతో నాగ్‌, నిఖిల్‌లు ఇద్దరూ ఈ సినిమాలో నటించేందుకు సమ్మతించారట. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలుకాబోతున్నట్టు సమాచారం.సీనియర్ అండ్ యంగ్ హీరోస్ తో సరికొత్త కథతో సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ప్రేమమ్ లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీ మార్చిలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇందులో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తోంది. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ సరసన నటించిన రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ జోడీగా మంజిమా మోహన్ లేదా మెహ్రిన్ కౌర్ నటించే అవకాశం ఉంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

English summary
Tollywood Superstar Nagarjuna and young hero Nikhil Siddharth are going to join forces. The duo are likely to share screen space in a forthcoming film to be directed by Chandu Mondeti who is hot on the heels, with the success of “Premam.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu