»   » అఖిల్ ఔట్ పుట్: నాగార్జున హ్యాపీగా లేడా?

అఖిల్ ఔట్ పుట్: నాగార్జున హ్యాపీగా లేడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నిర్మిస్తున్నాడు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఔట్ పుట్ చూసిన నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

‘అఖిల్' మూవీని సోషియో ఫాంటసీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో భారీగానే గ్రాఫిక్స్ ఉన్నాయట. సినిమాను అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి చేసుకున్నా గ్రాఫిక్స్ మాత్రం కావాల్సిన విధంగా రాలేదని అంటున్నారు. దీంతో నాగార్జున, దర్శకుడు వివినాయక్ గ్రాఫిక్స్ విషయంలో మార్పులు చేయాలనుకుంటున్నారట. అయితే నిర్మాత నిఖిల్ మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ పై సంతృప్తిగానే ఉన్నాడని, ఎలాగైనా సినిమాను దసరాకి విడుదల చేయాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రాఫిక్స్ విషయంలో మళ్లీ మార్పులు చేస్తే సినిమా విడుదల లేటవుతుందని, దసరా రేసు నుండి అఖిల్ తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరో వైపు డిస్ట్రిబ్యూటర్స్ నుండి కూడా సినిమాను దసరాకే విడుదల చేయాలని ప్రెషర్ పెరుగుతోందట. ఒక వేళ సినిమాను దసరాకు విడుదల చేయకుంటే.... ముందుగా మాట్లాడుకున్న అమౌంట్లో కేవలం 70శాతం మాత్రమే చెల్లిస్తామని అంటున్నారట.

Nag not satisfied on Akhil output

ఈ పరిస్థితుల నేపత్యంలో నిర్మాత నితిన్ ఆందోళన చెందుతున్నాడని, ఎలాగైనా సినిమాను దసరాకే విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఖిత్ తొలి సినిమా కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని, తొలి సినిమా దెబ్బకొడితే అఖిల్ కెరీర్ మీద ప్రభావం చూపుతుందని నాగార్జున వర్రీ అవుతున్నాడట.

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akkineni Akhil’s socio fantasy entertainer ‘Akhil’ is believed to have so much graphics work. Although the film’s shoot has completed on time, the VFX work hasn’t come out as desired.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu