»   » స్వయంగా నాగార్జునే చెప్పాడు, నానితో నాగ్ కలిసి సినిమా కన్‌ఫార్మ్

స్వయంగా నాగార్జునే చెప్పాడు, నానితో నాగ్ కలిసి సినిమా కన్‌ఫార్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య టాలీవుడ్ లో మల్తీ స్టారర్లకి కాస్త ఆదరణ పెరుగుతోందనే చెప్పాలి ఒకరితో ఒకరు కలిసి నటించేందుకు మన హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు. అదే క్రమం లో నాని, నాగార్జున కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే టాక్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక‌ ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుందో లేదో అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే, ఆ సినిమాపై సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ నాగ్ ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. నానితో క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

నానితో కాంబో సినిమా పై వ‌స్తున్న పుకార్ల‌కు నాగ్ క్లారిటీ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ మల్టీస్టారర్ చేయ‌బోతున్నాన‌ని నాగ్‌ స్పష్టం చేశాడు. తాను నానితో క‌లిసి న‌టించ‌బోతున్న సంగ‌తి వాస్త‌వ‌మేన‌ని క‌న్ ఫ‌ర్మ్ చేశాడు. ఈ సినిమాలో నాని పాత్ర ఎంతో సరదాగా సాగిపోతుంద‌ని నాగ్ చెప్పాడు. తన పాత్ర కూడా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుందన్నాడు. అభిమానులందరినీ ఎంట‌ర్ టైన్ చేసేలా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని చెప్పాడు.

Nag opens up about his multi-starrer with Nani

'భలే మంచిరోజు', 'శమంతకమణి' సినిమాల‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. న‌లుగురు యంగ్ హీరోల‌తో శమంతకమణి సినిమాను రూపొందించి ప‌ర్వా లేద‌నిపించాడు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కాక‌పోయినా, ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అదే ఊపులో నాగ్‌, నానిల కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కించేందుకు ఆదిత్య సిద్ధ‌మ‌య్యాడు. అశ్వ‌నీద‌త్‌, నాగ్‌, నానీ ల‌ క్రేజీ కాంబోలో రాబోతున్న‌ ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి.

English summary
By now, everyone knows that Nagarjuna is doing a multi-starrer with Nani. The film will be directed by Sriram Aditya and speaking about the project, Nagarjuna said that he is very impressed with the script as both him and Nani are playing very interesting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu