For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ అదుర్స్: 'గ్రీకువీరుడు' ఆడియో (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగార్జున హీరోగా నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం 'గ్రీకు వీరుడు'. నాగ్ సరసన నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ. 'సంతోషం' దర్శకుడు దశరథ్ ఈ చిత్రాన్ని పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మలిచారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. నాగార్జున ఈ పంక్షన్ లో చాలా జోష్ గా కనపించారు. తన తండ్రి,కుమారులతో కలిసి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... ''మీ వయసు వెనక్కి వెళ్తోంది... ఎప్పటికప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నారని అందరూ నన్ను అడుగుతుంటారు. ఆ రహస్యం... అభిమానులు నాపై చూపిస్తున్న ఆదరణే. ఈ సినిమాని చూశాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఇదొక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. '' అన్నారు . వచ్చేనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...అబ్బాయి మేడిన్‌ అమెరికా. మనసు మాత్రం పక్కా ఇండియా. పిజ్జా, శాండ్‌విచ్‌ల మధ్య పెరిగినా, మనదైన ఆవకాయ రుచినే ఇష్టపడతాడు. అయితే ప్రేమ, పెళ్లి.. ఈ తతంగాలపై నమ్మకం మాత్రం లేదు. ఎంతమందినైనా ప్రేమించొచ్చు అనేది అతని ఫిలాసఫీ! చూడ్డానికి గ్రీకు వీరుడిలా ఉంటాడు కాబట్టి.. అమ్మాయిలూ అతని ప్రేమలో పడిపోతారు. ఈ అమెరికా అబ్బాయి అభిప్రాయాలకు విరుద్ధభావాలున్న ఓ అమ్మాయి తారసపడింది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు.

  ఆడియో విడుదల విశేషాలు స్లైడ్ షో లో...

  పరిశ్రమలో ని పెద్దలంతా ఈ పంక్షన్ కి తరిలి రావటంతో సినిమా పరిశ్రమకు చెందిన పంక్షన్ లా కనువిందు చేసింది.

  తొలి సీడీని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. వి.వి.వినాయక్‌, బోయపాటి శ్రీను స్వీకరించారు.

  నాగార్జున మాట్లాడుతూ... గ్రీకువీరుడు అంటే నాకు అర్థం తెలియదు. 'నిన్నే పెళ్లాడతా' చిత్రీకరణ సమయంలో కృష్ణవంశీని అడిగా. ఇప్పుడు దశరథ్‌ని అడుగుతున్నాను. సంతోషం తర్వాత దశరథ్‌తో చాలా సార్లు సినిమా చెయ్యాలనుకొన్నాను. అది ఇప్పటికి కుదిరింది అన్నారు.

  నాగార్జున కంటిన్యూ చేస్తూ...ఈ చిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. తమన్‌ ఇచ్చిన సంగీతం వినగానే స్టెప్పులు వేయాలనిపించింది. వేసేశాను. 'భాయ్‌'కి దేవిశ్రీప్రసాద్‌ మంచి టైటిల్‌ సాంగ్‌ ఇచ్చాడు. అందులోనూ మంచి స్టెప్పులేశాను. యువతరం నాకు మంచి ఉత్సాహాన్నిస్తోంది అన్నారు.

  అలాగే నేను ఇలా ఉన్నానంటే కారణం నాన్నగారు. ఆయన్నుంచి క్రమశిక్షణ అలవడింది. మా అబ్బాయిలు కూడా అది నేర్చుకొంటారని నమ్మకముంది అని నాగ్ చెప్పారు.

  మొన్న ఎవరో అడిగారు. ఎప్పుడు రిటైర్‌ అవుతారని. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు, చైతన్య, అఖిల్‌ రిటైరవుతారేమో కానీ... నేను మాత్రం ఎప్పటికీ రిటైర్‌ కాను. ఎప్పటికీ కింగ్‌గానే ఉంటాను అని నవ్వుతూ నాగార్జున చెప్పారు.

  నిర్మాత మాట్లాడుతూ ''మూగ మనసులు సినిమా చూసి నాగేశ్వరరావుకి అభిమానినైపోయాను. ఆ తర్వాత ఆయనతో సినిమా తీసే అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో తీసే అవకాశం లభించింది. వాళ్లబ్బాయితో 'హలోబ్రదర్‌' రీమేక్‌ చేస్తున్నాను. 'గ్రీకువీరుడు' సినిమా కోసం యూనిట్‌ చాలా కష్టపడింది''అన్నారు.

  అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ''ఈ టైటిల్‌ చాలా తమాషాగా ఉంది. నాగార్జున గ్రీకువీరుడిగా ఎలా ఉంటాడో మీరే వూహంచుకోండి. సినిమా రంగానికి నన్ను పరిచయం చేసింది తమన్‌ కుటుంబమే. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంది. మావాడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు అని చెప్పుకోను. అలా చెప్పుకొనే లక్షణాలు మా వంశంలోనే లేవు'' అన్నారు.

  నాగచైతన్య మాట్లాడుతూ ''2002లో 'సంతోషం' వచ్చింది. మంచి కుటుంబ ప్రేమకథ ఎలా ఉండాలో అలా ట్రెండ్‌ సెట్‌ చేసింది. పదకొండేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా వస్తోంది. 2013 మనందరికీ పండగే. వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందరూ రెడీగా ఉండండి'' అన్నారు.

  ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''చాలా మంది సినిమాల్లోనే కాకుండా బయట కూడా నటిస్తుంటారు. నాగార్జున మాత్రం సినిమాల్లో మాత్రమే నటిస్తారు. తమన్‌ ఎప్పుడు మ్యూజిక్‌ నేర్చుకొన్నాడో ఎప్పుడు సంగీత దర్శకుడు అయ్యాడో తెలియదు. నన్ను ఎప్పుడూ మావయ్య అని పిలుస్తుంటాడు. ఈ సినిమాలో పాటలు పాడటం ఆనందంగా ఉంది'' అన్నారు.

  అనుష్క మాట్లాడుతూ ''సూపర్‌ నుంచి నాగార్జునని చూస్తూనే ఉన్నా. అప్పట్నించీ ఆయన అలాగే ఉన్నారు. సినిమాల కోసం అందరూ ఫిట్‌గా తయారవుతుంటారు. కానీ నాగ్‌ సినిమాలు ఉన్నా లేకపోయినా తన కోసం తాను ఫిట్‌గా ఉంటారు''అన్నారు.

  వినాయక్‌ మాట్లాడుతూ ... ''నాగార్జునగారు అంటే నాకు గౌరవం. ఇప్పటికీ ఆయన ప్రేమకథలు చేస్తూనే ఉన్నారు. దశరథ్‌ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా సంతోషం కంటే పెద్ద విజయం కావాలి'' అన్నారు.

  బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''వెంకటేష్‌, బాలకృష్ణలతో చేసే అవకాశం నాకు వచ్చింది. నాగార్జునతో ఇప్పుడు కాకపోయినా మరో ఐదేళ్ల తర్వాతైనా సినిమా చేస్తాను. అప్పటికీ ఆయన ఇలాగే ఉంటారు''అన్నారు.

  ఈ వేదికపై అఖిల్‌ అక్కినేని సరదాగా విజిల్‌ వేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

  ఈ కార్యక్రమంలో అమల, సుశాంత్‌, ప్రియమణి, కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, భీమనేని శ్రీనివాసరావు, వీరభద్రమ్‌చౌదరి, చంద్రసిద్ధార్థ్‌ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  
 
 The audio of Nagarjuna’s upcoming film Greekuveerudu was launched in style in Hyderabad. ANR, SP Balasubramaniam, K Raghavendra Rao, Nagarjuna, Naga Chaitanya, Akhil, Amala Akkineni, Anushka, Priyamani, Thaman, D Sivaprasad Reddy Sushanth, Boyapati Sreenu, V V Vinayak, K L Narayana and Krishna Chaitanya were some of the celebrities who graced the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X