»   »  మాస్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ :నాగ్ ‘ఓం నమో వెంకటేశాయ’ టీజర్

మాస్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ :నాగ్ ‘ఓం నమో వెంకటేశాయ’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "ఈ కొండపై ఎవరిమీద ఈగ వాలినట్లు తెలిసినా, ఈ ఉగ్రశ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాల నరసింహుని సాక్షిగా, పదివేల శిరస్సుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను ." ఈ డైలాగు వింటే ఏ మాస్ సినిమాలో అనిపిస్తోంది కదూ. కానీ ఇది భక్తిరస ప్రధాన చిత్రంలో డైలాగు అంటే నమ్మబుద్ది కాదు కదా. అన్ని రకాల వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి మాస్ ఎలిమెంట్స్ సైతం మిక్స్ చేసి, భక్తి చిత్రం రూపొందిస్తున్నారు దర్శకేంద్రుడు.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఓం నమో వెంకటేశాయ. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హథీరాంబాబా జీవిత నేపధ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ నటుడు సౌరభ నటిస్తోండగా, అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనుంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


Nag's Om Namo Venkatesaya Teaser

ఇక నాగార్జున హథీరాంబాబా పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. చిత్రంలో నాగ్ లుక్ ని ఇప్పటికే రివీల్ చేసిన చిత్ర యూనిట్ టీజర్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఫిబ్రవరిలో ఓం నమో వెంకటేశాయ మూవీ విడుదల కానున్నట్టు తెలుస్తోంండగా, ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


ఇక జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ లో వీరందరి పాత్రలను పరిచయం చేస్తూ వీడియో వదిలాడు రాఘవేంద్రరావు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.


కీరవాణి ఈ చిత్రానికి సంబంధించి అద్బుతమైన బాణీలు కడుతున్నాడు. అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి తర్వాత నాగ్- రాఘవేంద్రరావు కాంబినేషనల్‌లో వస్తోన్న ఓం నమో వెంకటేశాయ చిత్రం మరో భక్తిరస చిత్రంగా సూపర్ హిట్ సక్సెస్ సాధించనుందని అభిమానులు భావిస్తున్నారు.

English summary
Nagarjuna's upcoming devotional entertainer 'Om Namo Venkatesaya's first teaser was unveiled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu