twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంస్కృతిని బట్టే కథలు పుడతాయి: నాగార్జున

    By Srikanya
    |

    హైదరాబాద్‌ :''సంస్కృతిని బట్టే కథలు పుడతాయి. మనకూ, ఇంగ్లీష్‌ చిత్రాలకూ కథల ఎంపికలో తేడా ఉండొచ్చు. కానీ సినిమా తీసే విధానం మాత్రం ఒక్కటే. సృజన ఉంటే సరిపోదు. దాన్ని వెండి తెరపై ఆవిష్కరించే నైపుణ్యం కావాలి. అవన్నీ ఫిల్మ్‌స్కూల్స్‌లో నేర్పుతారు. నాణ్యమైన సినిమాలు రావాలంటే.. శిక్షణ తీసుకొన్న సాంకేతిక నిపుణుల వల్లే సాధ్యమవుతుంది''అన్నారు నాగార్జున .

    అలాగే ''గత నాలుగైదేళ్లలో సినిమా, టీవీ రంగాల్లో వినూత్నమైన మార్పు కనిపిస్తోంది. అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు పరిశ్రమకు మరింత మంది సుశిక్షితులైన సాంకేతిక నిపుణులు కావాలి''అన్నారు నాగార్జున. అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాకు సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    ఇక నాగార్జున హీరోగా నటించిన చిత్రం 'గ్రీకువీరుడు' విడుదలకు సిద్దమవుతోంది. నయనతార హీరోయిన్ . దశరథ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌లో విడుదల చేస్తారు. నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ''తమన్‌ అందించిన బాణీలు తప్పకుండా ఆకట్టుకొంటాయి. 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

    English summary
    Nagarjuna speaking at Annapurna International School of Film Making said there is lot of change in film and TV industries and there are offers galore for talented and well trained technicians. He said stories will come based on traditions and though there will be difference between storylines between Tollywood and Hollywood, film making is same. He said mere creativity is of no use if one doesn't have talent to enact it on silver screen. He said all this will be taught in the film school.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X