twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'షిర్డి సాయి' ఆడియో తేదీ ఫిక్స్

    By Srikanya
    |

    నాగార్జున తాజాగా 'షిర్డి సాయి' అనే భక్తి రస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జునకీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ని ఈ నెల 25వ తేదీన జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గత రాఘవేంద్రరావు, నాగర్జున కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు లాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

    సమత, మమత, ప్రేమ... లాంటి మానవతా భావనల గురించి జనావళికి చెప్పిన అవధూత షిర్డీ సాయిబాబా. 'ఆత్మవత్‌ సర్వభూతాని' అనే భగవద్గీత తత్వాన్ని చూపించి... మానవ రూపంలో ఉన్న దైవంగా భక్తుల పూజలందుకొన్నారు. బాబా బోధనలు, మహాత్మ్యాల్ని తెరపైకి తీసుకొస్తున్నారు కె.రాఘవేంద్రరావు.

    ఈ చిత్రం విషేషాలు నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిస్తున్నారు''అన్నారు.

    ''వాసనలు వేరైనా, వర్ణాలు ఎన్నయినా పూలన్నీ ఒక్కటే. ప్రతి పువ్వు పూజించడానికి అర్హమైనదే అనేది సాయిబాబా ప్రబోధం. కులమతాలను త్యజిద్దాం, మనుషులంతా ఒక్కటే అనేది ఆ మాటల్లో అంతర్లీనంగా ఉన్న సత్యం. పరమాత్ముడు ఎక్కడో లేడు, పసిపాప మనసున్న ప్రతి వ్యక్తిలోనూ దేవుడున్నాడని బోధించారాయన. సాయి జీవనశైలి, ఆయన ఆధ్యాత్మిక చింతన యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. సాయి పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోయారు. కీరవాణి సంగీతం మరింత బలం తీసుకొచ్చింది''నాగార్జున అన్నారు.

    సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్‌, సంగీతం: కీరవాణి.

    English summary
    Nagarjuna's upcoming devotional venture 'Shirdi Sai' audio will be releasing on 25th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X