ఆ దెయ్యాల గదిలోకి కాజల్: నాగార్జున ఇంట్రస్ట్ వల్లనే??
నాగార్జున నటిస్తున్న రాజుగారి గది చిత్రంలో కాజల్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "రాజు గారి గది" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే "రాజు గారి గది 2". కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గ్లామర్ క్వీన్ కాజల్ వరుస సినిమాలతో జోరు పెంచింది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కథానాయికగా నటించిన కాజల్ తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం చిత్రంలో నటించింది . ఇక ఇప్పుడు విజయ్ 61వ చిత్రం మెర్సల్ తో పాటు కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ చిత్రంలోను కథానాయికగా నటిస్తుంది. తాజాగా మరో ఆఫర్ ఈ అమ్మడికి దక్కినట్టు సమాచారం.

2015లో చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన రాజుగారి గదికి సీక్వెల్ గా రాజు గారి గది2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్ మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడు. సీరత్ కపూర్, సమంతలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హార్రర్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ మూవీలో నటించాల్సిందిగా నాగార్జున ఈ హీరోయిన్ ను కోరినట్లు సమాచారం. ఈ మూవీ కోసం తన పది రోజుల కాల్షీట్ కేటాయించింది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ది. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











