పక్క హీరో సినిమా నాశనాన్ని కోరుకోవడం దారుణం: ఖైదీ-శాతకర్ణి ఫైట్ మీద నాగబాబు!

మా అన్నయ్య గారి ఫ్యాన్స్ కి, ఇతర హీరోల ఫ్యాన్స్ కి చెప్పేది ఒకటే. ఇప్పుడు నడుస్తున్న ఫ్యాన్స్‌ వార్‌ ఏమాత్రం సరైంది కాదు. ఈ పండుగా అందరికీ సంతోషాన్ని, సూపర్‌ హిట్స్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నాను .

By Bojja Kumar

హైదరాబాద్: ప్రతి ఏడాది సంక్రాంతి పండగ వచ్చిందంటే బాక్సాఫీసు వద్ద సందడే సందడి. ముఖ్యంగా పెద్ద స్టార్ల సినిమాలు పోటా పోటీగా విడుదలవుతుంటాయి. సినిమా బాక్సాఫీసు వద్ద సంక్రాంతి రారాజు ఎవరనే విషయమై అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ఈ సారి మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తూ సంక్రాంతి బరిలోకి వస్తుండగా, నందమూరి నటసింహం తన ప్రతిష్టాత్మక 100వ సినిమాతో బాక్సాఫీసు రేసులోకి దూసుకొస్తున్నారు. సినిమా విడుదల తేదీలు ఖరారైనప్పటి నుండి ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఓ రేంజిలో వార్ మొదలైంది.

మరో వైపు మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఇటీవల ఓ ఈ సంక్రాంతి మనదే అంటూ..... కామెంట్ చేసారు. బాలయ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఇటీవల ఆడియో వేడుకలో ఖబడ్దార్ అంటూ కామెంట్ చేసారు దర్శకుడు క్రిష్. మొత్తానికి ఈ పరిణాలు సంక్రాంతి బాక్సాఫీసు రేసును ఆసక్తికరంగా మార్చాయి. రెండు సినిమాలపై అంచనాలు కూడా భారీగా ఉండటంతో ఈ సారి బాక్సాఫీసు రారాజు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

నాగబాబు స్పందిస్తూ...

నాగబాబు స్పందిస్తూ...

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్‌ నాగబాబు ఈ పరిణామాలపై స్పందించారు. సినిమా అనేది వందల మంది కృషి, వేల మంది జీవితం. లక్షల కోట్ల మంది అభిమానం. నా సినిమా బాగా ఆడాలని కోరుకోవడం మామూలు కోరిక. నా సినిమా మాత్రమే ఆడాలని కోరుకోవడం మాత్రం పచ్చి స్వార్థం. మనం బ్రతుకుతుంది ఒక కల్చర్ ఉన్న సొసైటీలో, పది మందికి మంచి చెప్పే ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. మనం తీసే సినిమాలు సమాజం మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి మనమే పక్క హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమా మీద కామెంట్లు, అది బాగా ఆడకూడదని కోరుకోవడం, మనది మాత్రమే బాగా ఆడాలని కోరుకోవడం ఈ ధోరణి ఎందుకో నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది.

బాధ్యతగా వ్యవహరిద్దాం అంటున్న నాగబాబు

బాధ్యతగా వ్యవహరిద్దాం అంటున్న నాగబాబు

ఒక సినిమా రిలీజ్ కాకముందే కొన్ని సోషల్ వెబ్ సైట్లలో ఆ సినిమా బాగా లేదంట, ఆ సినిమా పోయిందట అంటూ ప్రీ రిలీజ్ కే రివ్యూలు రాసేయడం, నెగెటివ్ కామెంట్స్ పాస్ చేయడం ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. సినిమా రిలీజైన తర్వాత ఆ సినిమా బావుందా? బాగా లేదా? అని రాసే హక్కు ప్రతి వారికి ఉండొచ్చు. కానీ రిలీజ్ ముందే ఇలాంటి చేయడం, పక్కోడి సినిమా ఆడకూడదని కోరుకోవడం చాలా దారుణం. ఒకరినొకరు చాలెంజ్ గా తీసుకోవడాలు కూడా మానుకోవాలి. ఒక బాధ్యతా యుతమైన పొజిషన్లో ఉన్న మనం కొద్దో గొప్పో ఆలోచించుకోవాలని మాట్లాడుకోవాలి. మనం ఇలాంటి ధోరణి మానుకుని ఇండస్ట్రీకి శత్రువుగా ఉండే పైరసీపై కలిసి కట్టుగా పోరాడాలి. అంతే కానీ మనలో మనం గొడవలు పడటం వదులుకోవాలి.

అభిమానులను ఉద్దేశించి నాగబాబు ఇలా

అభిమానులను ఉద్దేశించి నాగబాబు ఇలా

ఈ సందర్భంగా ముఖ్యంగా ఫ్యాన్స్ కి మా అన్నయ్య గారి ఫ్యాన్స్ కి, ఇతర హీరోల ఫ్యాన్స్ కి చెప్పేది ఒకటే. సినిమా అంటే కేవలం హీరోలదే కాదు. ఒక్కో సినిమా తెరకెక్కడంలో వేల మంది కష్టం ఉంటుంది. సినిమా ఫ్లాపయితే ఎంతో మంది బాధపడతారు. మన సినిమా హిట్‌ అయితే ఆనందమే. అంతమాత్రం చేత వేరే సినిమా ఫ్లాపవాలని కోరుకోవడం దారుణం. సినీ పరిశ్రమకు ఇది మంచిది కాదు అన్నారు.

ఫ్యాన్స్ వార్ సరైంది కాదు

ఫ్యాన్స్ వార్ సరైంది కాదు

ఇప్పుడు నడుస్తున్న ఫ్యాన్స్‌ వార్‌ ఏమాత్రం సరైంది కాదు. సంక్రాంతి సీజన్‌లో మూడు సినిమాలు విడుదలైనా బ్లాక్‌బస్టర్‌లుగా నిలవగలవు. ఈ పండుగా అందరికీ సంతోషాన్ని, సూపర్‌ హిట్స్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నాను అని నాగబాబు అన్నారు.

‘ఖైదీ నెం 150’ ఇదిరా చిరంజీవి అనేలా ఉంటుందన్న మెగాస్టార్

‘ఖైదీ నెం 150’ ఇదిరా చిరంజీవి అనేలా ఉంటుందన్న మెగాస్టార్

చాలా కాలం తర్వాత మళ్లీ ప్రేక్షకల ముందుకు 150వ సినిమాతో వస్తున్నాను. సినిమా అభిమానులను మెప్పిస్తుంది, ఇదిరా చిరంజీవి అనేలా ఉంటుందని స్వయంగా ఈ సినిమా గురించి మెగాస్టారే వెల్లడించడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మేకింగ్ వీడియోస్

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మేకింగ్ వీడియోస్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ మేకింగ్ వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X