Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్లీ బుక్కైన నాగబాబు.. పోస్ట్ డిలీట్ చేస్తూ సర్దుకున్న మెగా బ్రదర్
ఏదైనా అతి కూడా మంచిది కాదంటారు. అలానే సోషల్ మీడియాలో మరీ యాక్టివ్‌గా ఉండటం కూడా అంత మంచిది కాదేమో. ఒక్కోసారి తొందర్లో చేసే పోస్ట్‌ల వల్ల ట్రోలింగ్‌కు గురి కావల్సి వస్తుంది. అది తప్పని అందరూ చెప్పడంతో వెనక్కి తిరిగి చూసుకుని ఆ పోస్ట్‌లను డిలీట్ చేస్తుంటారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అయితే నాగబాబు ఈ మధ్య వరుసగా ఇలాంటి చిన్న చిన్న తప్పులే చేసి దొరికిపోతున్నాడు. నాగబాబు ఉద్దేశ్యం మంచిదే అయినా కూడా ఇలా చిన్ని చిన్ని తప్పులతో పప్పులో కాలేస్తున్నాడు.

అదో అలవాటు..
నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యాడు. తనకు తెలిసిన వాళ్లు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు బర్త్ డే విషెస్ చెబుతూ వారి గురించి తనకు తెలిసినవన్నీ చెబుతూ ఓ పోస్ట్ వేస్తున్నాడు. ఇందులో తప్పేమీ లేదు. అది హర్షించదగ్గ విషయమే. కానీ ఇలా చేస్తున్న క్రమంలోనే చిన్న తప్పులు చేస్తున్నాడు.

ఫోటో మారింది..
మొన్న కపిల్ దేవ్ బర్త్ డే. ఈ క్రమంలో కపిల్ దేవ్‌కు విషెస్ చెబుతూ.. రణ్ వీర్ సింగ్ ఫోటోను షేర్ చేశాడు. కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరకెక్కిన 83 సినిమాలోని రణ్ వీర్ పోస్టర్‌ను నాగబాబు షేర్ చేయడంతో అందరూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో వెంటనే తప్పు తెలుసుకుని పోస్ట్ డిలీట్ చేశాడు.

తాజాగా ఇలా..
తాజాగా నాగబాబు అల్లు అరవింద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నేడు అల్లు అరవింద్ బర్త్ డే అంటూ ఆయన గురించి ఓనాలుగు మాటలు గొప్పగా చెప్పాడు. అక్కడితో అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత సుకుమార్ బర్త్ డే అని మరో పోస్ట్ చేశాడు. అక్కడే అసలు తప్పు జరిగింది.

సుకుమార్ బర్త్ డే అంటూ..
సుకుమార్ బర్త్ డే అంటూ నాగబాబు ఆయన గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పాడు. స్కూల్‌లో టీచర్ ఉద్యోగం మానేసి .. టాలీవుడ్‌కు సినిమాలు ఎలా తీయాలో నేర్పించాలని మనసులో నిశ్చయించుకున్నాడని నాకు అనిపిస్తుందంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. సుకుమార్ గురించి నాగబాబు గొప్పగా చెప్పడం కూడా బాగానే ఉంది. కానీ ఈ రోజు సుకుమార్ బర్త్ డే కాదని నాగబాబు ఆలస్యంగా తెలుసుకున్నాడు.

పోస్ట్ డిలీట్..
సుకుమార్ బర్త్ డే రేపు (జనవరి 11). కానీ నేడు సుకుమార్ బర్త్ డే అని పొరబడి ముందుగానే పోస్ట్ చేశాడు. నెటిజన్లు కామెంట్లతో ట్రోల్ చేసేసరికి నాగబాబు ఆ పోస్ట్‌లను డిలీట్ చేశాడు. ఇలా పోస్ట్ డిలీట్ చేయడంతోనే అది అందరి దృష్టిలో పడింది. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇలా అన్నింట్లోనూ పోస్ట్ డిలీట్ చేసేశాడు. కానీ అంతలోపే స్క్రీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.