»   » మాటకి మాట, దెబ్బకి దెబ్బ: నాగ చైతన్య

మాటకి మాట, దెబ్బకి దెబ్బ: నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాటకి మాట, దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతమే ప్రపంచంగా బతికే వ్యక్తి సూర్య. అన్యాయానికి ఎదురెళ్లి వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటాడు. కానీ అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి. అవేంటనేది తెరపైనే చూడాలంటున్నారు నాగచైతన్య. ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. సమంత హీరోయిన్ . దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ సమర్పణలో కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు.


నాగచైతన్య మాట్లాడుతూ... 'నా కెరీర్‌లో నేనెంతో ఇష్టపడి, కష్టపడి చేస్తున్న సినిమా 'ఆటోనగర్ సూర్య'. నా పాత్రను దేవాకట్టా తీర్చిదిద్దిన తీరు వండర్. నా కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కె.అచ్చిరెడ్డి. ఒక ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 27 నుంచి నాలుగు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారు. అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే పాటలను కూడా విడుదల చేయనున్నాం' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించే యువకుడి కథ ఇది. నాగచైతన్యని వైవిధ్యంగా చూపించబోతున్నామ''న్నారు. ''ఈ నెల 27 నుంచి ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తాం. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి'' అన్నారు నిర్మాత.

Naga Chaitanya about Autonagar Surya

'మనం' సినిమా గురించి చెబుతూ -''తాతయ్యతో, నాన్నతో తెరను పంచుకోవడం అద్భుతమైన అనుభవం. హీరోగా నాకు చాలా థ్రిలింగ్ మూమెంట్ ఇది. విక్రమ్ కుమార్ చాలా గొప్పగా సినిమాను తీస్తున్నారు. ఏ మాయ చేశావె, ఆటోనగర్ సూర్య చిత్రాల తర్వాత సమంత నాకు పెయిర్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో తాజా షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తున్నాం. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది'' అని తెలిపారు.
English summary
Autonagar Surya is a forthcoming Telugu film directed by Deva Katta. The film, which is said to be a political thriller film, stars Naga Chaitanya and Samantha in the lead while starring Rakul Preet Singh, Sai Kumar in pivotial roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu