»   » క్లైమాక్స్ విషయంలోనే తేడా: నాగచైతన్య

క్లైమాక్స్ విషయంలోనే తేడా: నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముగింపు సన్నివేశాల విషయంలో రెండు భాషలకీ తేడా ఉంటుంది. మిగిలినదంతా ఒకేలా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నానని..నాగచైతన్య తన లేటెస్ట్ చిత్రం 'ఏ మాయ చేసావె' గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో త్రిష, శింబులతో రూపొందింది. రెండు చిత్రాలు ఒకే రోజు (శుక్రవారం) రిలీజు కానున్నాయి. అలాగే ఎఆర్ రహమాన్ వంటి సంగీత దర్శకుడుతో పనిచేయటం తనుకు ఆనందాన్ని ఇస్తోందన్నారు.

"మంచి నిర్మాణ సంస్థ...గొప్ప దర్శకుడు...భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు...వీళ్లందరి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న సినిమాలో నేను హీరోని కావడం ఎంతో సంతోషంగా ఉంది..ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు..చాలా రోజుల తరవాత వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది అంటాడు. సున్నితమైన భావోద్వేగాలతో సాగుతుంది. దీంట్లో నేను సహాయ దర్శకుడి పాత్రలో కనిపిస్తాను. రెహమాన్‌ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. నెమ్మది నెమ్మదిగా పాటలు శ్రోతల్లోకి వెళుతున్నాయి" అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంజయ్‌ స్వరూప్‌ నిర్మాత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu