»   » ఆమె కోసం ఎదురుచూస్తున్నా: నాగ చైతన్య

ఆమె కోసం ఎదురుచూస్తున్నా: నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'ప్రేమించే వ్యక్తి ముందు ఏమాత్రం నటించకుండా నిజాయతీగా ఉండాలి. అలాంటి ప్రేమ, అలా ఉండే వ్యక్తులనే నేనూ ఇష్టపడతా. నాకూ ప్రేమలో పడాలనే ఉంది. జీవితంలో అన్నీ అనుకోకుండా జరుగుతాయి. అలానే మనకు తగ్గ అమ్మాయి కూడా అనుకోకుండా వస్తుందన్నదే నా నమ్మకం. మన చేతుల్లో ఉన్నదల్లా ఆ సమయం కోసం ఎదురుచూడటమే. ప్రస్తుతం నేను చేస్తున్నదదే' అంటున్నాడు చైతూ.

'ఏమాయ చేశావే'తో రొమాంటిక్‌ హీరో ఇమేజ్‌ తెచ్చుకున్న నాగచైతన్య, నిజజీవితంలోనూ ప్రేమకు చాలా విలువిస్తానని అంటున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య ఆటోనగర్ సూర్య విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్‌ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్‌ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.

విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

English summary
Naga Chaitayna says that he is waiting for a girl in his real life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu