»   » నాగచైతన్య చేస్తున్నచిత్రాల తాజా సమాచారం

నాగచైతన్య చేస్తున్నచిత్రాల తాజా సమాచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య ఒకే సారి రొమాంటిక్ ఫిల్మ్ లోనూ, యాక్షన్ ఎంటర్టైనర్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్సకత్వంలో బన్నీ వాసు నిర్మించే గీతా ఆర్ట్స్ వారి చిత్రం ఆల్ మోస్ట్ ఫిప్టీ పర్శంట్ కంప్లీట్ అయింది. తమన్నా హీరోయిన్ గా చేసే ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ సాగుతుందని తెలుస్తోంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. కాజల్ హీరోయిన్ గా కామాక్షి ఎంటర్ ప్రైజస్ వారు నిర్మించే ఈ చిత్రాన్ని అజయ్ భుయాన్ డైరక్ట్ చేస్తున్నారు. రెండు డిఫెరెంట్ జనర్స్ తో దూసుకువెళ్తున్న నాగచైతన్యపై అభిమానులు మంచి ఎక్సపెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల అనంతరం చేయటానికి నాగచైతన్య మరో రెండు సబ్జెక్టులను రెడీ చేసుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu