»   » అఖిల్, నాగ చైతన్య ఒకే సినిమాలో...... రూమర్ కాదు నిజమే

అఖిల్, నాగ చైతన్య ఒకే సినిమాలో...... రూమర్ కాదు నిజమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మూడో త‌రం హీరోల్లో నాగ‌సుశీల త‌నయుడు సుశాంత్ కూడా ఒక‌డు. కాళిదాసు, క‌రెంట్‌, అడ్డా చిత్రాల్లో న‌టించిన ఈ యువ హీరో ఇప్పుడు జి.నాగేశ్వ‌ర‌ర‌రెడ్డి దర్శ‌క‌త్వంలో ఆటాడుకుందాం..రా సినిమా చేస్తున్నాడు. చాలాకాం గా సరైన సక్సెస్ లేని సుషాంత్ ఇప్పుడు నిలదొక్కుకోవటానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. లేదంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో నిలదొక్కుకోవటం కష్టమే. కామెడి విత్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం స‌క్సెస్‌పై సుశాంత్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నిన్న ఈ సినిమా సాంగ్స్ కూడా విడుద‌ల‌య్యాయి.

అందుకే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే తపనతో సాధ్యమైనంత వరకూ తనసినిమాకి హైప్ తీసుకురావాలనే ఆలోచిస్తున్నాడు. దానిలో భాగం గానే తన బావమరుదులిద్దరినీ రంగంలోకి దించాడు. అఖిల్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్నాడు. అలాగే నాగ చైతన్య కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ కు జోడీగా సోనం భజ్వా నటిస్తోంది. అలాగే ఇంటెర్వెల్, క్లైమ్యాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది. 'అనూప్ రూబెన్స్' సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 'నాగ సుశీల' నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్, చైతూ ల లుక్ ఎలా ఉండబోతోందీ... "ఆటాడుకుందాం రా" సినిమా విశేషాలేంటో స్లైడ్ షో లో చూద్దాం...


సుశాంత్

సుశాంత్

చాలా కాలంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న అక్కినేని హీరో సుశాంత్ తాజాగా జి. నాగేశ్వర రెడ్ది దర్శకత్వంలో "ఆటాడుకుందాం రా" చిత్రంలో నటిస్తున్నాడు.


సక్సెస్

సక్సెస్

చాలాకాం గా సరైన సక్సెస్ లేని సుషాంత్ ఇప్పుడు నిలదొక్కుకోవటానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. లేదంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో నిలదొక్కుకోవటం కష్టమే. కామెడి విత్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం స‌క్సెస్‌పై సుశాంత్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.


హైప్

హైప్

అందుకే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే తపనతో సాధ్యమైనంత వరకూ తనసినిమాకి హైప్ తీసుకురావాలనే ఆలోచిస్తున్నాడు.


దేవదాసు

దేవదాసు

పాటలు మినహా టోటల్‌ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంకోసం నటసామ్రాట్‌ డా. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు' చిత్రంలోని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో' పాటని రీమిక్స్‌ చేశారు.


అఖిల్, నాగ చైతన్య

అఖిల్, నాగ చైతన్య

సుశాంత్ కు సపోర్ట్ గా అక్కినేని హీరోలు ‘అఖిల్, నాగ చైతన్య'లు కూడా కనిపించనున్నారు.సుశాంత్ అడగ్గానే ఏమాత్రం కాద‌న‌కుండా వెంట‌నే సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్ చేయ‌డానికి రెడీ అయిపోయార‌ట ఈ యువ హీరోలు.


నాగ‌సుశీల‌

నాగ‌సుశీల‌

అత్తమ్మ నాగ‌సుశీల‌పై ఉన్న ప్రేమ‌తో నాగ‌ చైత‌న్య‌, అఖిల్‌లు ఈ సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్‌లు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని వారిద్ద‌రూ క‌న్‌ఫ‌ర్మ చేశారు. అయితే ఇద్ద‌రూ ఓ సాంగ్‌లో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నున్నార‌ట‌.


అఖిల్

అఖిల్

అఖిల్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్నాడు. అలాగే నాగ చైతన్య కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ కు జోడీగా సోనం భజ్వా నటిస్తోంది.


ఇంటెర్వెల్

ఇంటెర్వెల్

అలాగే ఇంటెర్వెల్, క్లైమ్యాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది. ‘అనూప్ రూబెన్స్' సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘నాగ సుశీల' నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


బ్రహ్మానందం

బ్రహ్మానందం

ఇక బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరిని అలరిస్తోందనే కాన్ఫిడెంట్ తో యూనిట్ ఉంది.


19న

19న

ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా ‘ఆటాడుకుందాం.. రా' మూవీని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకని నిర్వహించారు. అనూప్ రూబెన్స్‌ ట్యూన్ చేసిన పాటలు అందరిని అలరిస్తున్నాయి.


English summary
Naga Chaitanya and Akhil will be seen in this film that stars their cousin Sushant. It will be feast for the eyes with three good looking men from Akkineni household in the same film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu