For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జున తెలంగాణ వ్యూహం ఫెయిల్ !?

  By Srikanya
  |

  నాగార్జున చాలా తెలివిగా తెలంగాణ ఇష్యూని ఎదుర్కోవటానికి జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో రూపొందుతున్న రాజన్నని నిర్మించి,నటిస్తున్నారు. అయితే ఆయనకీ తెలంగాణ వారు ఆయన్ని విడిచిపెట్టడం లేదు. రెండు రోజుల క్రితం రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ చిత్రానికి తెలంగాణ ఇబ్బందులు ఎదురయ్యాయి.చిత్రం యూనిట్ హైదరాబాద్ పరిసరాలలో షూటింగ్ జరుపుకునేందుకు ఒక భారీ సెట్ వేసింది. అయితే ఒక కళాశాల భవనం లో వేసిన ఈ సెట్ లోకి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు, తెలంగాణ విద్యార్ధులు చొరబడి చిత్రం షూటింగ్ ను అడ్డుకున్నారు. తెలంగాణ విద్యార్ధుల జీవితాలతో సినిమా పరిశ్రమ అడుకున్తోందని నినాదాలు చేస్తూ గొడవ చేసారు. ఇక చేసేది లేక చిత్రం సభ్యులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. బెజవాడ చిత్రం అక్టోబర్ 21 విడుదల అయ్యేందుకు సిద్ధ పడుతోంది. మరో ప్రక్క బెజవాడ రౌడీలు పేరు మార్చినా కుడా ఈ చిత్రం ఇంకా వివాదాలలో చిక్కు కోవటం నాగార్జునని భాధిస్తోంది.

  ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. నాగచైతన్య, అమలాపాల్‌ జంటగా నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఛేజింగ్‌ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 12 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రిస్తారు.

  దీపావళికి సినిమా విడుదలవుతుంది.బెజవాడ నాదిరా... ముట్టుకుంటే పగిలిపోద్ది.. బెజవాడ సినిమాలో నాగచైతన్య చెప్పే డైలాగ్ ఇది.దీన్నే ప్రోమోలలో రిలీజ్ చేసారు.నాగచైతన్య 'బెజవాడ"గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది" అన్నారు.ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా కాంట్రావర్శీ పేరుకుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు. ప్రభు, కోట శ్రీనివాసరావు, అంజన, బ్రహ్మానందం, అజయ్‌, సత్యప్రకాష్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Naga Chaitanya's 'Bejawada' was stopped shooting in outskirts of Hyderabad by Telangana activists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X