»   » 'ఏ మాయ చేసావె'లో నాగచైతన్య పాత్ర

'ఏ మాయ చేసావె'లో నాగచైతన్య పాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో రెడీ అయిన 'ఏ మాయ చేసావె' ఈ శుక్రవారం రిలీజవుతోంది. ఆ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు కార్తీక్. ఇంజనీరింగ్ చదవి సినిమాల పట్ల అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ ఫీల్డ్ లోకి అడుగుపెడతాడు.పూరీ జగన్నాధ్ దగ్గర అసెస్టెంట్ గా పని చేస్తూంటాడు. అలాగే సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే పక్కింటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె పేరు జెస్సీ. మళయాళీ క్రిస్టియన్. ఆ పాత్రను కొత్త హీరోయిన్ సమంత చేసింది. ఇక వీరిద్దరి మధ్య స్క్రీన్ కెమెస్ట్రీ కూడా బాగా పండిందని చెప్తున్నారు. ఇందులో ముడు పాటలు న్యూయార్క్ లో, ఒక పాట హైదరాబాద్ లోని సెట్ లో, మిగిలిన పాటలు చెన్నైలోని వివిధ లొకేషన్లలో తీశారు. అలాగే గౌతం మీనన్..ఘర్షణ తర్వాత తెలుగులో స్ట్రైయిట్ గా రూపొందించిన చిత్రం ఇది. జోష్ తర్వాత నాగచైతన్య హీరోగా చేసిన చిత్రం ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu