»   » కాజల్ తో మనస్పర్ధలు గురించి నాగచైతన్య

కాజల్ తో మనస్పర్ధలు గురించి నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్ ‌కి, నాకు 'దడ" షూటింగ్‌లో ఏవో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అలాంటిదేం లేదు. కాజల్ బెస్ట్ కో స్టార్ అని తేల్చేసాడు నాగచైతన్య. తన తాజా చిత్రం దడ రిలీజ్ కు దగ్గరవ్వటంతో నాగచైతన్య మీడియాను కలిసి ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే అనూష్క కీ తనకీ వివాహం అయ్యిందంటూ వచ్చిన వార్తలను సైతం ఆయన కొట్టి పారేస్తూ..ఇటీవలి కాలంలో కొన్ని వదంతులు వచ్చాయి. నేను పెళ్లి చేసుకుంటే మీ మీడియాని పిలిచి ఆ ఆనందాన్ని హాయిగా పంచుకుంటాను. అన్నారు.

ఇక తన వారసత్వం గురించి చెబుతూ..స్టార్ హీరో కుమారుడ్ని కాబట్టి కెరీర్ సజావుగా ఉంటుందనడానికి లేదు. ఆ ప్రభావం ఒకటి, రెండు సినిమాల వరకే ఉంటుంది. ఆ తర్వాత నటుడిగా నిరూపించుకుంటేనే కెరీర్ ఉంటుంది అని వివరించారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు గురించి చెబుతూ...'బెజవాడ రౌడీలు" 45 శాతం పూర్తయ్యింది. ఈ కథ నచ్చి చేశాను. ఈ టైటిల్ పెట్టాలన్నది రామ్‌గోపాల్‌వర్మగారి నిర్ణయం. ఇదే టైటిల్ ఉన్నా, మార్చినా నాకభ్యంతరం లేదు. విజయవాడలో షూటింగ్ చేసినప్పుడు మాకెలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు అన్నారు.

English summary
“I don’t know why these baseless things are being said about me. I share a warm camaraderie with Kajal. We had absolutely no issues while working and our movie is due for release without any hiccups.” ....Naga Chaitanya
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu