»   »  నాగ చైతన్య ‘దోచేయ్’ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)

నాగ చైతన్య ‘దోచేయ్’ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘దోచేయ్'. ఇటీవలే ఫస్ట్ లుక్ అఫీషియల్ గా విడుదల చేసారు. టైటిల్‍‌కు తగిన విధంగానే ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ , కొన్ని పాటలు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనా రీషూట్ లు చేసారని అందుకే లేటయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

పూర్తైన రషెష్ చూసిన నాగార్జున, నాగ చైతన్య కొన్ని సూచనలు చేసారని, అందుకు తగినట్లు దర్శకుడు రీషూట్ లు చేసారని చెప్పుకుంటున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన లొకేషన్ స్టిల్స్ విడుదలయ్యాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

స్లైడ్ షోలో ‘దోచేయ్' సినిమాకు సంబంధించిన లొకేషన్ స్టిల్స్...

విడుదల

విడుదల

ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కృతి సానన్

కృతి సానన్


చైతన్య సరసన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి.

త్వరలో ఆడియో

త్వరలో ఆడియో


వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల కానుంది.

ఇదీ పాయింటు

ఇదీ పాయింటు


''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.

నిర్మాత నమ్మకం

నిర్మాత నమ్మకం


నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య చాలా డెటికేటెడ్‌ ఆర్టిస్ట్‌. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు.

తెరపై, తెర వెనక

తెరపై, తెర వెనక


ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Naga Chaitanya 'DohChay' first look poster released. Makers are planning to release this film on March 20th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu