»   » నాగ చైతన్య సరసన కాజల్ చేస్తున్న చిత్రం

నాగ చైతన్య సరసన కాజల్ చేస్తున్న చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర' ఘన విజయంతో కాజల్ కి తెలుగునాట మరింత డిమాండ్ ఏర్పడింది. దాంతో ఆమె నాగచైతన్య సరసన బుక్కయింది. అజయ్ భువన్ అనే నూతన దర్శకుడు రూపొందించే చిత్రానికి గానూ ఆమె కమిట్ అయింది. కామాక్షి కళా మందిర్ నిర్మించే ఈ చిత్రాన్ని నాగార్జున రెగ్యులర్ నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆయన నాగార్జునకి క్లోజ్ ప్రెండ్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం నాగార్జున తో 'కేడీ' చిత్రం నిర్మిస్తున్నారు. అలాగే ఈ బ్యానర్ కి 2010లో సిల్వర్ జూబ్లి సంవత్సరం కావటం మరో విశేషం. ఇక దర్శకుడు అజయ్ భువన్ ఇంతకు ముందు హౌస్ ఫుల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. చంద్ర సిద్దార్ధ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున అతనికీ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. మార్చి నుంచి ఈ చిత్రం ప్లోర్ కు వెళ్లనుంది. అలాగే ఈ చిత్రంలో ఎక్కువ భాగం విదేశాలలో జరగనుందిని సమాచారం. జ్ఞాన శేఖర్ ఈ చిత్రానికి కెమెరా వర్క్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu