twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగారి ఫేస్ లో ఎంత రిలీఫో

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొత్తానికి రేపు రిలీజ్ అవుతుందా లేదా అనే సందిగ్ధానికి తెర వేస్తూ ఆటో నగర్ సూర్య చిత్రం విడుదలకు సిద్దమైంది. కోర్టు అడ్డంకలను సమర్ధవంతంగా దాటేసింది. చివరి క్షణం వరకూ ఈ సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, దేవకట్టా, దిల్ రాజు, అచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందిరికన్నా నాగచైతన్య ముఖంలో పూర్తి రిలీఫ్ కనపడింది. రిజల్ట్ సంగతి దేముడెరుగు...మొత్తానికి విడుదల అవుతోందనే ఉత్సాహం అతని ముఖంలో కనపడింది.

    Naga Chaitanya full happy with ANS Release

    నాగ చైతన్య మాట్లాడుతూ 'ఈ సినిమా రిలీజ్ కి ఎంతో కష్టపడిన ఫైనాన్సియర్స్, దిల్ రాజుకి నా స్పెషల్ థాంక్స్. ఆలస్యం అయినా సరైన సమయానికే ఈ సినిమా వస్తోంది. దేవకట్టా చాలా బాగా తీసాడు. కచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది' అన్నాడు.

    నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ఆటోనగర్‌సూర్య . దేవకట్టా దర్శకుడు. సమంత హీరోయిన్. ఆర్‌.ఆర్‌ మూవీమేకర్స్‌ సమర్పణలో మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మించారు. సెన్సార్‌ సహా అన్నికార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 27న సినిమా రిలీజ్‌ కానుంది.

    Naga Chaitanya full happy with ANS Release

    దర్శకుడు దేవాకట్టా మాట్లాడుతూ- సెన్సార్‌ సింగిల్‌ కట్‌ కూడా లేకుండా ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సభ్యులు చాలా మంచి సినిమా తీశారని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది అన్నారు.

    నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. వెన్నెల, ప్రస్థానం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన దేవాకట్టా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఏమాయ చేశావె, మనం చిత్రాల తర్వాత మరో హిట్‌ కొట్టబోతున్నారు చైతూ-సమంత జంట. ఇష్క్‌, గుండె జారి.. , మనం తర్వాత మరో హిట్‌ ఆల్బమ్‌ని అనూప్‌ ఇచ్చారు. సంగీతం పెద్ద అస్సెట్‌. ఇదో లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. తప్పక విజయం సాధిస్తుంది అన్నారు.

    ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్‌ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.

    విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    Naga Chaitanya and Samantha are the current hit pair in Tollywood with two hits in a row including Ye Maya Chesave and Manam. Now, the duo long awaited film Autonagar Surya is slated for June 27th release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X