»   » నెల రోజులు పాటు బ్యాంకాక్ లో నాగచైతన్య

నెల రోజులు పాటు బ్యాంకాక్ లో నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగాచైతన్య బ్యాంకాక్ ప్రయాణం పెట్టుకున్నాడు.అక్కడో నెల రోజులు పాటు ఉండబోతున్నాడు.అయితే అక్కడ ఎంజాయ్ చేయటానికి కాదు.అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడకి వెళ్థున్నాడు.ఈ షెడ్యూల్ లో మేజర్ టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు.కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రాన్ని యాక్షన్ కామిడీగా చెప్తున్నారు.

చందన్ రెడ్డి తమ కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ కెమెరా అందిస్తున్నారు.ఇప్పటికే ఫిలిఫ్పీన్స్ లోనూ,హైదరాబాద్ లోనూ ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఇక దర్శకుడు అజయ్ భుయాన్ ఇది తొలి చిత్రం కాదు.హౌస్ ఫుల్ అనే చిత్రాన్ని గతంలో డైరక్ట్ చేసాడు.కానీ ఆ చిత్రం విడుదలకాకపోవటంతే ఇదే తొలి చిత్రం అయ్యేటట్లు ఉంది.ఇక ఈ చిత్రం వేసవి తర్వాత విడుదల అవుతుంది.

English summary
Naga Chaitanya is going to go to Bangkok for almost a month His upcoming film which is being directed by Ajay Bhuyan is going to be shot in Bangkok.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu